భారత్‌లో ఈ ఏడాది ఇంధన గిరాకీ 11.5 శాతం మేర క్షీణించవచ్చని ఫిచ్ సొల్యూషన్స్ అంచనా వేస్తోంది. 2020-21లో భారత వాస్తవ జీడీపీ -4.5 శాతంగా నమోదు కావొచ్చన్న అంచనాలను కాస్తా -8.6 శాతానికి ఆర్థికవేత్తలు సవరించడం ఇందుకు నేపథ్యం.
అంతక్రితం ఇంధన గిరాకీ వృద్ధి అంచనా -9.4 శాతంగా ఉంది. దేశవ్యాప్త లాక్‌డౌన్ మే 31నే ఎత్తివేసినా.. రాష్ట్ర స్థాయిలో కొన్ని చోట్ల నిబంధనలు కొనసాగుతుండడం ఆర్థిక రికవరీని ఆలస్యం చేస్తున్నాయని ఫిచ్ తెలిపింది. అటు వినియోగదారు, ఇటు పరిశ్రమ స్థాయిల్లో ఇంధనానికి గిరాకీ తగ్గుతున్నట్లు కనిపిస్తోందని పేర్కొంది.