కరోనాతో నెలకొన్న ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో పన్ను చెల్లింపులదారులకు.. ఊరటనిచ్చింది కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల విభాగం (సీబీఐసీ). ఆర్థిక చట్టం 1994, ఛాప్టర్ V పరిధిలోని.. సీజీఎస్టీ, ఐజీఎస్టీ, కస్టమ్స్, ఎక్సైజ్ చట్టాల కింద అన్ని వ్యక్తిగత అపీళ్లను వీడియా కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని నిర్ణయించింది.
ఆర్థిక చట్టం 1994 పరిధిలోని కస్టమ్స్, ఎక్సైజ్ వివాదాల విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టాలని ఈ ఏడాది ఏప్రిల్లోనే సీబీఐసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. సీబీఐసీ తీసుకున్న ఈ నిర్ణయంతో అపీలేట్ ప్రక్రియ వేగవంతమైంది. తీర్పులు కూడా త్వరగా రావడం, ప్రయాణ ఖర్చులు తగ్గడం, భౌతిక దూరం పాటించడం వంటి వాటికి తోడ్పడింది.