ప్రపంచ వాణిజ్య వృద్ధిలో 2020 తొలినాళ్లలో వాణిజ్యం బలహీనంగా కొనసాగే అవకాశం ఉందని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) అభిప్రాయపడింది. అయితే కరోనా వైరస్ భయాలు వాణిజ్య వృద్ధిని మరింత క్షీణింపజేసే అవకాశాలు కన్పిస్తున్నాయని వెల్లడించింది.
"2020 ప్రారంభంలో వాణిజ్య కార్యకలాపాల వృద్ధి తగ్గే సూచనలు కన్పిస్తున్నాయి. అయితే ఇటీవల క్షీణతకు కరోనా కారణం కాదు. కానీ కరోనా భయాలు వాణిజ్య వృద్ధిలో మరింత క్షీణతను కలగజేస్తాయి."