ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి ఆటాడుకుంటోంది. ఇప్పటికే పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనం దిశగా వెళ్తున్నాయి. అభివృద్ధి చెందిన ఐరోపా, అమెరికా దేశాలు కూడా కోలుకోలేని స్థాయిలో దెబ్బతిన్నాయి. కరోనా నియంత్రణకు మన దేశంలోనూ లాక్‌డౌన్ విధించడంతో పారిశ్రామిక కార్యకలాపాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. గత రెండు వారాలుగా లాక్‌డౌన్ నడుస్తుండటం వల్ల ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఆదాయం, లాభం భారీగా తగ్గే అవకాశం ఉందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత గిరాకీ మళ్లీ సాధారణ స్థితికి రావడానికి ఎక్కువ సమయమే పట్టొచ్చని భావిస్తున్నాయి. ఉద్యోగాల కోతకు ఈ పరిణామాలు దారితీయొచ్చని సీఐఐ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా సీఈఓలు ఈ సర్వేలో పాల్గొని ఆయా అంశాలపై అభిప్రాయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా..
లాభాదాయాలు
ప్రస్తుత త్రైమాసికం (ఏప్రిల్- జూన్)తో పాటు గత త్రైమాసికంలో (జనవరి- మార్చి) ఆదాయం 10 శాతానికి పైగా తగ్గొచ్చని సర్వేలో ఎక్కువ మంది సీఈఓలు అభిప్రాయపడ్డారు. లాభాలు కూడా 5 శాతం మేర తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే.. దేశ జీడీపీ వృద్ధిపై తీవ్ర ప్రభావం పడొచ్చు.
నిల్వలు