తెలంగాణ

telangana

ETV Bharat / business

మందగమనంపై ప్రియాంక 'హౌదీ-మోదీ' పంచ్ - కేంద్రం

ఆర్థిక మందగమనం వ్యవహారంలో మరోసారి కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. పెట్టుబడిదారులు నమ్మకం కోల్పోతున్నా... మోదీ ప్రభుత్వం వాస్తవాన్ని అంగీకరించే పరిస్థితుల్లో లేదని మండిపడ్డారు. మాటలు ఆపి.. చేతల్లో చూపించాలని హితవు పలికారు.

మందగమనంపై ప్రియాంక 'హౌదీ-మోదీ' పంచ్

By

Published : Sep 18, 2019, 12:58 PM IST

Updated : Oct 1, 2019, 1:17 AM IST

మందగమనంపై ప్రియాంక 'హౌదీ-మోదీ' పంచ్

దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితుల గురించి కేంద్రంపై విమర్శల దాడిని పెంచుతున్నారు కాంగ్రెస్​ నాయకురాలు ప్రియాంక గాంధీ. పెట్టుబడిదారుల్లో విశ్వాసం దెబ్బతింటున్నా, ఆశలు సన్నగిల్లుతున్నా... మోదీ ప్రభుత్వం వాస్తవాన్ని అంగీకరించట్లేదని ఆరోపించారు.

ఓ మీడియా నివేదికను ఉదహరిస్తూ ట్వీట్ చేశారు ప్రియాంక. భారత ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని మోదీ పెంచుతారన్న ఆశలతో గత ఆరేళ్లుగా విదేశీ పెట్టుబడిదారులు 45 బిలియన్​ డాలర్ల పెట్టుబడుల్ని భారత మార్కెట్లలో పెట్టారని.. కానీ గత జూన్​ నుంచి 4.5 బిలియన్ల షేర్లు విక్రయించారని పేర్కొన్నారు.

విదేశీ పెట్టుబడులపై మీడియా నివేదిక ఉదహరణ

హ్యూస్టన్​లో ప్రవాస భారతీయులు నిర్వహించనున్న హౌదీ-మోదీ కార్యక్రమాన్ని ఉద్దేశించి.. ప్రియాంక పరోక్షంగా ప్రధానిని విమర్శించారు.

''రోజూ 5 ట్రిలియన్, 5 ట్రిలియన్​ అని ఆడంబరాలకు పోవడం, వార్తా పత్రికల్లో ముఖ్యాంశంగా పేర్కొనడం ద్వారా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేం. విదేశాల్లో కార్యక్రమాలను ప్రోత్సహించినంత మాత్రాన పెట్టుబడిదారులను రప్పించలేరు .''

- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి

''పెట్టుబడిదారుల్లో నమ్మకం సడలింది. ఆర్థిక పునాదులకు పగుళ్లొచ్చాయి.'' అని హిందీలో ట్వీట్​ చేసిన ఆమె.. 'భాజపా బ్యాడ్​ ఫర్​ బిజినెస్'​ అనే హ్యాష్​ట్యాగ్​ను జోడించారు.

''భాజపా ప్రభుత్వం.. వాస్తవాన్ని అంగీకరించేందుకు నిరాకరిస్తోంది. ఆర్థిక వ్యవస్థ సూపర్ ​పవర్​గా అవతరించే సమయంలో ఈ మందగమనం స్పీడ్​ బ్రేకర్​ వేసింది. పరిస్థితుల్ని మెరుగుపర్చకుండా... ఎంత హడావుడి చేసినా నిరుపయోగమే.''

- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి

ఆర్థిక వ్యవస్థ మందగమనంపై గత కొద్ది రోజులుగా కేంద్రాన్ని విమర్శిస్తూ వస్తున్నారు ప్రియాంక గాంధీ. దీనిపై బదులివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేస్తున్నారు.

ఇదీ చూడండి:'వృద్ధి మందగమనాన్ని ఆర్థిక మంత్రి అంగీకరించాలి'

Last Updated : Oct 1, 2019, 1:17 AM IST

ABOUT THE AUTHOR

...view details