తెలంగాణ

telangana

ETV Bharat / business

లాక్​డౌన్​ వేళ రాష్ట్రాలకు ఉపశమనం- జీఎస్టీ పరిహారం విడుదల

కరోనా మహమ్మారి నేపథ్యంలో జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రాలకు రావాల్సిన రూ.34వేల కోట్ల పరిహారాన్ని అందజేసింది కేంద్రం. ఫిబ్రవరి 27తో తొలి దఫా రూ.19,950 కోట్లు విడుదల చేసిన కేంద్రం... ఈనెల 7 మిగతా రూ.14,103 కోట్లు అందించింది.

GST
లాక్​డౌన్​ నేపథ్యంలో రాష్ట్రాలకు ఉపశమనం

By

Published : Apr 8, 2020, 5:22 PM IST

కరోనా మహమ్మారి విజృంభణ, దేశవ్యాప్త లాక్​డౌన్​తో ఆదాయ నష్టాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు ఉపశమనం కలిగించింది కేంద్ర ప్రభుత్వం. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో ఆదాయ నష్టాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు పరిహారం కింద ఇవ్వాల్సిన రూ.34,000 కోట్లు పూర్తిస్థాయిలో అందించింది.

ఈ ఏడాది ఫిబ్రవరి 27న తొలి దఫాలో రూ.19,950 కోట్లు విడుదల చేసిన కేంద్రం.. తాజాగా ఈనెల 7 మంగళవారం మిగతా రూ.14,103 కోట్లు అందించింది. దీంతో గత అక్టోబర్​, నవంబర్ నెలలకు సంబంధించిన బకాయిలు మొత్తం విడుదల చేసినట్లయింది.

డిసెంబర్​, జనవరి బకాయిలు త్వరలోనే..

గత ఏడాది డిసెంబర్​, ఈఏడాది జనవరికి సంబంధించిన పరిహారాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది కేంద్ర ఆర్థిక శాఖ.

జీఎస్టీ చట్టం నియమాల ప్రకారం.. జీఎస్టీ అమలులోకి వచ్చిన 2017 జులై 1 నుంచి ఐదేళ్ల పాటు రాష్ట్రాల పన్ను ఆదాయం 2015-16 ఆర్థిక సంవతర్సాన్ని ఆధారంగా చేసుకుని 14 శాతం పెరగకుండా ఆ నష్టాన్ని కేంద్రం భరిస్తుంది. ఇప్పటి వరకు రూ.2.45 లక్షల కోట్లు పరిహారం కింద రాష్ట్రాలకు విడుదల చేసింది కేంద్రం.

ABOUT THE AUTHOR

...view details