తెలంగాణ

telangana

ETV Bharat / business

రాష్ట్రాలకు ఊరట- రుణ పరిమితి పెంపు

రాష్ట్రాల రుణ పరిమితిని 5 శాతానికి పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఇంతకుముందు అది జీఎస్​డీపీలో 3 శాతంగా ఉండేది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రాలకు రూ. 4.28లక్షల కోట్లు అదనంగా అందుబాటులో రానున్నాయి.

By

Published : May 17, 2020, 1:18 PM IST

Centre raises borrowing limit of states from 3 pc of GSDP to 5 pc in FY21
రాష్ట్రాల రుణపరిమితి 5శాతానికి పెంపు

దేశవ్యాప్త లాక్​డౌన్​తో డీలాపడ్డ రాష్ట్రాలకు అండగా నిలిచే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం. 2020-21గాను రాష్ట్రాల రుణ పరిమితిని జీఎస్​డీపీలో 3 శాతం నుంచి 5 శాతానికి పెంచింది. దీని వల్ల రూ. 4.28 లక్షల కోట్లు అదనంగా అందుబాటులో ఉంటాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు.

కేంద్రం లెక్కలు...

  • 2020-21కు గానూ రాష్ట్రాల రుణ పరిమితి రూ. 6.41లక్షల కోట్లు.(3శాతం జీఎస్​డీపీ ఆధారంగా)
  • ఇందులోని 75శాతాన్ని 2020 మార్చిలోనే అన్ని రాష్ట్రాలకు అందించాము.
  • రాష్ట్రాలు ఇప్పటివరకు తీసుకున్న రుణాలు 14శాతం. 86 శాతం ఇంకా వినియోగించుకోలేదు.

ఇప్పటికే చేసిన సహాయం...

"కేంద్ర ఆదాయం కూడా భారీగా క్షీణించింది. అయినప్పటికీ రాష్ట్రాల అవసరాలను గుర్తించి.. సహాయం చేస్తున్నాం" అని తెలిపారు విత్త మంత్రి.

  • ఏప్రిల్​ నెలలోని పన్నుల వాటా కింద రూ.46,038కోట్లు రాష్ట్రాలకు అందించాం.
  • ఏప్రిల్​, మే నెలకు గానూ రాష్ట్రాలకు ఆదాయం లోటును(రూ.12,390కోట్లు) మంజూరు చేశాం.
  • ఎస్​డీఆఎఫ్​ నిధులను(రూ.11,092కోట్లు) ముందుగానే, ఏప్రిల్​ మొదటి వారంలో విడుదల చేశాం.
  • కరోనాయేతర కార్యకలాపాల కోసం ఆరోగ్య శాఖ నుంచి రూ. రూ.4,113కోట్లు విడుదల చేశాం.

ABOUT THE AUTHOR

...view details