తెలంగాణ

telangana

By

Published : Apr 3, 2020, 7:49 PM IST

ETV Bharat / business

జన్​ధన్ ఖాతాల్లో కరోనా సాయం తొలి విడత జమ

పీఎం జన్​ధన్​ యోజన మహిళా ఖాతాదారులు ఒక్కొక్కరికి రూ.500 నగదు జమ చేసింది కేంద్ర ప్రభుత్వం. మొదటి విడతలో భాగంగా 4.07కోట్ల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయగా.. మిగిలిన వారికి ఈ వారాంతంలోగా అందించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

Centre credits Rs 500 each to over 4.07 crore women Jan Dhan account holder
జన్​ధన్ మహిళల ఖాతాల్లో మొదటి విడత నగదు జమ

'పీఎం గరీబ్‌ కల్యాణ్‌ యోజన' ప్యాకేజీ కింద జన్‌ధన్‌ యోజన మహిళా ఖాతాదారులకు మొదటి విడతగా ఒక్కొక్కరి ఖాతాలో రూ.500 నగదును జమ చేసింది కేంద్రం. 21 రోజుల లాక్​డౌన్​ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన ఈ పథకంతో మొత్తం 20.39 కోట్ల జన్​ధన్​ ఖాతాదారులకు లబ్ధి చేకూరనుండగా.. ప్రస్తుతం 4.07కోట్ల ఖాతాల్లో డబ్బు జమయింది. మిగిలిన వారికి ఈవారం ముగిసే సరికి జమ చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

మూడు నెలలు రూ.1500

లాక్​డౌన్​ కారణంగా ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నవారిని ఆదుకునేందుకు గతనెలలో ప్రధాన్​ మంత్రి గరీబ్​ కల్యాణ్​ యోజన ప్యాకేజీ ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. పేద మహిళలకు ఏప్రిల్​ నుంచి రానున్న మూడు నెలలపాటు జన్​ధన్​ ఖాతాల్లో నెలకు రూ.500 జమ చేస్తామని స్పష్టం చేశారు. అందులో భాగంగానే మొదటి విడతగా ఇవాళ 4.07 కోట్ల మందికి నగదు జమ చేశారు.

సామాజిక దూరం పాటించేలా

కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. బ్యాంకుల నుంచి లబ్ధిదారులు నగదు ఉపసంహరణ చేసుకునే సమయంలో సామాజిక దూరం పాటించేలా తగు జాగ్రత్తలు తీసుకుంది కేంద్రం. ఖాతాదారుడి అకౌంట్ నెంబర్​లోని చివరి అంకెల ఆధారంగా ఉపసంహరణ షెడ్యూల్​ను సిద్ధం చేసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details