తెలంగాణ

telangana

ETV Bharat / business

రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలు.. ఫిబ్రవరి 1న పద్దు

ఫిబ్రవరి 1న పార్లమెంటు​లో పద్దు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 2020-21 బడ్జెట్​ సమావేశాలను ఈ నెలాఖరు నుంచి రెండు విడతల్లో నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్​ కమిటీ సిఫార్సు చేసింది.

BUDGET SESSION
బడ్జెట్​ సమాావేశాలు

By

Published : Jan 9, 2020, 6:44 AM IST

Updated : Jan 9, 2020, 11:42 AM IST

రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలు.. ఫిబ్రవరి 1న పద్దు

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలను జనవరి 31 నుంచి ఏప్రిల్‌ 3 వరకు రెండు విడతల్లో నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సు చేసింది. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు మొదటి విడత.. మార్చి 2 నుంచి ఏప్రిల్‌ 3 వరకు రెండో విడత బడ్జెట్​ సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.

రెండు విడతల మధ్య వచ్చే నెల రోజుల విరామంలో పార్లమెంటరీ కమిటీలు వివిధ మంత్రిత్వశాఖలకు కేటాయించిన బడ్జెట్‌ను పరిశీలిస్తాయి. కేంద్రమంత్రివర్గ సిఫార్సుల మేరకు పార్లమెంటు ఉభయసభలను రాష్ట్రపతి సమావేశ పరుస్తారు.

ఇదీ చూడండి:'ఖనిజ చట్టాల సవరణ ఆర్డినెన్స్'​కు ఆమోదం

Last Updated : Jan 9, 2020, 11:42 AM IST

ABOUT THE AUTHOR

...view details