తెలంగాణ

telangana

ETV Bharat / business

2019-20 ఐటీ రిటర్ను ఫారాలు విడుదల - ఆదాయపు పన్ను రిటర్ను ఫారాలు

2019-20 ఆర్థిక సంవత్సర ఆదాయ పన్ను రిటర్నుకు ఫారంలను నోటిఫై చేసింది ఆదాయ పన్ను శాఖ. ఈ మేరకు సంబంధిత వివరాలతో ఓ ప్రకటన జారీ చేసింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం.

forms for income tax returns
ఆదాయపు పన్ను రిటర్ను ఫారాలు విడుదల

By

Published : May 31, 2020, 2:46 PM IST

గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2019-20) ఆదాయ పన్ను రిటర్ను(ఐటీఆర్) దాఖలు చేసేందుకు కావాల్సిన ఫారాలను విడుదల చేసింది ఆదాయపు పన్ను శాఖ (ఐటీ).

సహజ్ (ఐటీఆర్-1), ఫారం ఐటీఆర్​-2, ఫారం ఐటీఆర్​-3, ఫారం సుగమ్ (ఐటీఆర్-4), ఫారం ఐటీఆర్​-5, ఫారం ఐటీఆర్-6, ఫారం ఐటీఆర్-7, ఫారం ఐటీఆర్​-Vలను 2020-21 మదింపు సంవత్సరానికి నోటిఫై చేసింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం (సీబీడీటీ).

కరోనా కారణంగా కేంద్రం ఇచ్చిన వెసులుబాట్లు, ప్రయోజనాలను పన్ను చెల్లింపుదారులకు అందించేందుకు ఐటీ ఫారార్లో మార్పులు చేసింది సీబీడీటీ. ఆదాయపు పన్ను చట్టం 1961 లోని వేర్వేరు కాలపరిమితులను పొడిగించింది కేంద్రం. ప్రత్యేక ఆర్డినెన్సు 2020 ద్వారా ఈ మార్పులు చేసింది.

దీని ప్రకారం చాప్టర్​-వీఐఏ-బీ ద్వారా పెట్టుబడులు, ఇతర చెల్లింపులు, సెక్షన్ 80 సీ(ఎల్​ఐసీ, పీపీఎఫ్, ఎన్ఎస్​సీ..) 80 డీ (మెడిక్లెయిమ్), 80 జీ (విరాళాల) ప్రయోజనాలు పొందేందుకు 2020 జూన్ 30 వరకు గడువు పొడిగించింది కేంద్రం.

ఇదీ చూడండి:ఉమంగ్ యాప్​తో పీఎఫ్​ విత్​డ్రా చేసుకోండిలా..

ABOUT THE AUTHOR

...view details