పద్దులో మౌలిక సదుపాయాల అభివృద్ధి కేటాయింపుల్లో భాగంగా ప్రకటించిన 'డెవలప్‌మెంట్ ఫినాన్స్ ఇన్‌స్టిట్యూషన్ (డీఎఫ్‌ఐ)' ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రూ.20,000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో డీఎఫ్‌ఐ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది కేంద్రం.
'డీఎఫ్‌ఐ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనితో దీర్ఘకాలంలో నిధులు పెంచుకునేందుకు ఒక సంస్థ, సంస్థాగత విధానాలు ఉండనున్నాయి. డీఎఫ్ఐకి కొన్ని సెక్యూరిటీలను జారీ చేసేందుకూ ప్రణాళికలు రూపొందిస్తున్నాం.' అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.