కార్మిక చట్టాల్లో భారీ మార్పులు తెచ్చే దిశగా భారీ సవరణలతో కూడిన 'వేజ్ కోడ్ బిల్లు'ను ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని భావిస్తోంది కార్మిక మంత్రిత్వ శాఖ. అంతకన్నా ముందు వచ్చేవారం ఈ బిల్లు కేబినెట్ అనుమతి పొందనుంది.
లోక్ సభలో ఈ బిల్లు 2017 ఆగస్టు 10న ప్రవేశపెట్టారు. 2017 ఆగస్టు 21న పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి పంపించారు. దీనిపై 2018 డిసెంబర్ 18న ప్యానెల్ నివేదికను సమర్పించింది. అయితే గత నెలలో 16వ లోక్ సభ రద్దయిన కారణంగా ఈ బిల్లు గడువు ముగిసింది.
కార్మిక చట్టాల్లో భారీ మార్పులు
ఈ వేజ్ కోడ్ బిల్లు ప్రస్తుతం ఉన్న 44 కార్మిక చట్టాలను సవరిస్తూ.. వ్యాపారాల నిర్వహణను సులభతం చేసి పెట్టబడులను పెంపొందించేందుకు ఈ బిల్లును రూపొందించింది మంత్రిత్వ శాఖ. సామాజిక భద్రత, పరిశ్రమల రక్షణ, సంక్షేమం సహా.. పరిశ్రమ సంబంధాలు వంటి నాలుగు అంశాలను ప్రధానంగా ఈ బిల్లులో పొందుపరిచారు.