కరోనా ఆర్థిక ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం
కరోనా ఆర్థిక ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం
14:37 May 20
కరోనా ఆర్థిక ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం
రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కరోనాతో దెబ్బతిన్న అన్ని రంగాలకు పునరుజ్జీవం అందించేందుకు ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద ఈ ప్యాకేజీని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ.
ఆర్థిక ప్యాకేజీతోపాటు మరికొన్ని కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది కేబినెట్.
- ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ (ఈసీఎల్జీఎస్) ద్వారా అదనంగా రూ. 3 లక్షల కోట్ల నిధులు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ (ఎన్సీజీటీసీ) ద్వారా మెంబర్ లెండిగ్ సంస్థలకు 100 శాతం రుణానికి హామీ ఇవ్వనున్నారు. అర్హతగల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎంఎస్ఎంఈ), ఔత్సాహిక ముద్ర రుణగ్రహీతలకు గ్యారంటీడ్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ సదుపాయం కల్పించేందుకు వీలు కలుగుతుంది.
- రెవెన్యూ షేరింగ్ విధానంలో బొగ్గు గనుల వేలానికి సంబంధించిన విధివిధానాల్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
- హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్ రుణాలపై వడ్డీ మాఫీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.
- ప్రధానమంత్రి వయ వందన యోజనను 2020 మార్చి 31 వరకు పొడిగించేందుకు అంగీకారం తెలిపింది మంత్రివర్గం.
- లాక్డౌన్తో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కూలీలకు ఆహారపదార్థాలు అందించేందుకు ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.
Last Updated : May 20, 2020, 3:38 PM IST