రూ.5 కోట్లకన్నా ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలకు కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల విభాగం (సీబీఐసీ) జీఎస్టీ వార్షిక రిటర్ను దాఖలు విషయంలో మరో వెసులు బాటు కల్పించింది. ఇకపై చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) ఆడిట్ నివేదిక స్థానంలో.. స్వీయ మదింపు రిటర్ను దాఖలు చేయొచ్చని వెల్లడించింది.
ఇక సీఏ అవసరం లేకుండానే జీఎస్టీ రిటర్నులు! - సీఏ అవసరం లేకుండానే జీఎస్టీ ఫైలింగ్
జీఎస్టీ రిటర్ను దాఖలు విషయంలో కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల విభాగం (సీబీఐసీ) చిన్న కంపెనీలకు మరో వెసులుబాటు కల్పించింది. రూ.5 కోట్లపైన టర్నోవర్ ఉన్న కంపెనీలు సీఏ ఆడిట్ చేసిన రిటర్ను స్థానంలో.. స్వీయ మదింపు రిటర్నును దాఖలు చేయొచ్చని తెలిపింది.
2020-21కి సంబంధించి.. వార్షిక నివేదిక రూ.2 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలు.. జీఎస్టీఆర్-9/9ఏ ద్వారా వార్షిక రిటర్ను దాఖలు చేయడం తప్పనిసరి. రూ.5 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలు జీఎస్టీఆర్-9సీ ద్వారా అదనంగా.. సర్దుబాటు స్టేట్మెంట్ సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు స్టేట్మెంట్కు.. చార్టర్డ్ అకౌంటెంట్ గుర్తింపు తప్పనిసరిగా ఉండేది. అయితే సీబీఐసీ తాజా నోటిఫికేషన్తో దీని స్థానంలో కంపెనీలు స్వయంగా మదింపు చేసిన రిటర్నును దాఖలు చేసుకునేందుకు వీల కలగనుంది.
ఇదీ చదవండి:పెరిగిన జీఎస్టీ వసూళ్లు- జులైలో రూ.లక్ష కోట్లపైకి