కరోనా సంక్షోభాన్ని అధిగమిస్తూ సేవా రంగ కార్యకలాపాలు వేగంగా పుంజుకుంటున్నాయి. వరుసగా రెండో నెలలోనూ సేవా రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 50కి పైగా నమోదైనట్లు ఐహెచ్ఎస్ మార్కిట్ నెలవారీ నివేదిక పేర్కొంది. ఆర్డర్లు పెరగటం వ్యాపారాల వృద్ధికి తోడైనట్లు వెల్లడించింది.
ఈ నివేదిక ప్రకారం.. నవంబర్‌లో సేవా రంగ పీఎంఐ అక్టోబర్‌తో పోలిస్తే స్వల్పంగా తగ్గి. 54.1 నుంచి 53.7గా నమోదైంది. అయినప్పటికీ లాక్డౌన్ సడలింపులు, డిమాండ్ వృద్ధి వంటివి సేవా రంగానికి సానుకూలమైన అంశాలుగా ఉన్నట్లు నివేదికలో పేర్కొంది ఐహెచ్ఎస్ మార్కిట్.
పీఎంఐ వృద్ధి ఇలా..