పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ సందర్బంగా.. బడ్జెట్ 2021-22 ప్రతిపాదనలు ప్రధానంగా ఆరు కీలక అంశాలపై ఆధారపడి ఉన్నట్లు చెప్పారు. ఆరోగ్యం-శ్రేయస్సు, భౌతిక, ఆర్థిక మూలధనం, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులు, మానవ సంక్షేమ మూలధనం, మినిమమ్ గవర్నమెంట్-మాక్సిమమ్ గవర్నెన్స్ ప్రధానంగా తీసుకున్నట్లు తెలిపారు.
'ఆరు కీలక అంశాల ఆధారంగా బడ్జెట్ ప్రతిపాదనలు' - కేంద్ర వార్షిక బడ్జెట్
వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలు ప్రధానంగా ఆరోగ్యం సహా ఆరు కీలక అంశాలపై ఆధారపడినట్లు తెలిపారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఆత్మనిర్భర్ భారత్ అంటే కొత్త ఆలోచన కాదన్నారు నిర్మల. పురాతన కాలం నుంచి భారత్ వర్తక, వాణిజ్యాలకు కేంద్రంగా నిలిచిందని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్.. 130 కోట్ల దేశ ప్రజల ఆకాంక్షగా పేర్కొన్నారు.
బడ్జెట్ రూపకల్పనలో ప్రధానంగా కీలక అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు నిర్మల. అందులో.. దేశమే తొలి ప్రాధాన్యం, రైతుల ఆదాయం రెట్టింపు, బలమైన మౌలిక సదుపాయాల కల్పన, ఆరోగ్య భారతం, స్వపరిపాలన, యువతకు అవకాశాల పెంపు, అందరికీ విద్య, మహిళా సాధికారత వంటివి ఉన్నట్లు తెలిపారు ఆర్థిక మంత్రి. అలాగే.. 2015-16లో బడ్జెట్లో ఇచ్చిన 13 హామీలను అమలు చేస్తామన్నారు.