తెలంగాణ

telangana

ETV Bharat / business

బడ్జెట్​ 2021: పర్యటకానికి షాక్- 19% కోత - బడ్డెట్ వార్తలు

కొవిడ్​-19తో తీవ్రంగా దెబ్బతిన్న రంగాల్లో పర్యటకం, ఆతిథ్యం ముందు వరుసలో ఉంటాయి. దేశంలో పర్యటకం కరోనా ముందరి స్థితికి చేరుకోవాలంటే ప్రభుత్వ మద్దతు అవసరం. అయితే నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్​లో ఎలాంటి ఉద్దీపన చర్యలు లేకపోగా గతం కంటే కేటాయింపుల్లో కోత విధించింది ప్రభుత్వం.

Budget
పర్యటకం

By

Published : Feb 1, 2021, 6:51 PM IST

పీకల లోతు కష్టాల్లో కూరుకుపోయిన పర్యటక, ఆతిథ్య రంగాలు.. ఈ బడ్జెట్​పై భారీ ఆశలే పెట్టుకున్నాయి. లాక్​డౌన్​ కాలానికి అనుమతుల రుసుముల మినహాయింపు, హోటళ్లు, రెస్టారెంట్లపై ఇన్​పుట్​ క్రెడిట్​తో 10 శాతంగా ఒకే విధమైన జీఎస్​టీ రేట్లతో పాటు ఇతర ఉపశమన చర్యలు ప్రకటిస్తారని ఆశించాయి. అయితే వారి ఆశలన్నీ అడియాశలు చేస్తూ కేటాయింపుల్లో భారీ కోత విధించింది సర్కార్.

పర్యటక శాఖకు 2020-21 బడ్డెట్​లో రూ.2,500 కోట్లు కేటాయించింది సర్కార్. అయితే ఈ ఏడాది దీనిని రూ.2,026 కోట్లకు తగ్గించింది. అంటే దాదాపు 19 శాతం కోత విధించింది. కరోనా వైరస్ సంక్షోభంతో వచ్చిన భారీ నష్టాల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోన్న పర్యటక రంగానికి ఇది పెద్ద దెబ్బ.

  • పర్యటకు శాఖకు బడ్జెట్​లో సవరించిన అంచనా రూ.1,260 కోట్లు. అయితే ఈ రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.1088 కోట్లు కేటాయించింది ప్రభుత్వం.
  • కరోనా వైరస్ సంక్షోభం దేశంలోకి విదేశీ పర్యటకుల రాకను మాత్రమే కాక దేశీయ టూరిస్టులను కూడా రాకుండా చేసింది. ఈ నేపథ్యంలో పర్యటకులను తిరిగి రప్పించడానికి అవసరమయ్యే ప్రచారం కోసమే నిధులను కేటాయించడంపై బడ్జెట్ దృష్టి పెట్టింది.
  • పర్యటక ప్రదేశాల ప్రచారం కోసం కేటాయించిన రూ.668 కోట్లలో రూ. 524 కోట్లు విదేశీ మార్కెట్ కోసం, రూ.144 కోట్లు దేశీయ పర్యటకం కోసం ఖర్చు చేయాలని నిర్ణయించింది.
  • సర్వీసు ప్రొవైడర్ల సామర్థ్యం పెంపు కోసం రూ. 63.65 కోట్లు.. శిక్షణ, నైపుణ్య అభివృద్ధి కోసం రూ.138 కోట్లు కేటాయించింది.

అయితే పర్యటక రంగానికి తక్షణ ఆర్థిక సాయం అందేలా బడ్జెట్​లో ఎలాంటి కేటాయింపులు లేకపోవడం నిరాశపర్చిందని పర్యటక రంగ ప్రముఖులు అన్నారు.

"బడ్జెట్ ప్రకటనలో పర్యటక రంగానికి సంబంధించిన సంక్షోభం గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడం మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పర్యటక, ప్రయాణ, ఆతిథ్య రంగం కొవిడ్- 19 కారణంగా శతాబ్దపు సంక్షోభంలో కూరుకుపోయింది. పునరుజ్జీవం కలిగించేలా ప్రభుత్వ చర్యలు తీసుకోకపోతే పర్యటకం గట్టెక్కడం కష్టమే."

- నకుల్​ ఆనంద్​, ఫెడరేషన్​ ఆఫ్​ అసోసియేషన్స్​ ఇన్​ ఇండియన్ టూరిజమ్​ అండ్​ హాస్పిటాలిటీ (ఫెయిత్)​ ఛైర్మన్

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details