తెలంగాణ

telangana

ETV Bharat / business

కొత్త పన్ను రేట్లతో సామాన్యుడికి మిగిలేది ఎంత? - Union Budget 2020

ఆదాయపు పన్ను విధానం సరళీకరణే లక్ష్యంగా సంస్కరణలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. స్లాబుల పెంపుతో పాటు పన్ను రేట్లను 5 శాతం తగ్గిస్తున్నట్లు బడ్జెట్​లో ప్రకటించింది. ఈ కొత్త రేట్ల ద్వారా గరిష్ఠంగా పన్ను చెల్లింపుదారునికి ఎంత లాభం కలుగుతుందో చూద్దాం..

Budget
Budget

By

Published : Feb 1, 2020, 5:54 PM IST

Updated : Feb 28, 2020, 7:18 PM IST

కేంద్ర బడ్జెట్​లో ఆదాయపు పన్నుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. పన్ను చెల్లింపుల్లో సరళీకరణ దిశగా అడుగులు వేసింది. పన్ను స్లాబులను 4 నుంచి 7కు పెంచిన కేంద్రం... పన్ను రేట్లను తగ్గించింది.

పాత విధానాన్ని కొనసాగిస్తూనే కొత్త పద్ధతిని తీసుకొచ్చింది కేంద్రం. కొత్త విధానాన్ని వినియోగించుకోవాలంటే ప్రభుత్వం ఇచ్చే మినహాయింపు, తగ్గింపులను వర్తించవనే షరతు పెట్టింది.

కొత్తగా తగ్గించిన పన్ను రేట్లు ముఖ్యంగా మధ్య, ఎగువ తరగతి వర్గాలను దృష్టిలో పెట్టుకుని చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏడాదికి 7.5 లక్షలు, ఆ పైన ఆదాయం ఉన్న వారికి 5 శాతం పన్ను రేట్లను తగ్గించింది. ఫలితంగా పన్ను చెల్లింపుదారునికి గరిష్ఠంగా రూ.75 వేలు మిగులు లభిస్తుండగా.. కేంద్రానికి రూ.40 వేల కోట్ల ఆదాయం తగ్గుతుంది.

గరిష్ఠంగా 75 వేలు మిగులు..

ఉదాహరణకు మీకు రూ.15 లక్షల ఆదాయం ఉన్నట్లయితే పాత పద్ధతి ప్రకారం రూ.2.62 లక్షలు పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇందులో 5 శాతం అంటే రూ.75 వేలు మినహాయింపు ఇస్తుంది. అంటే మీరు రూ.1.87 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది.

మీ ఆదాయాన్ని బట్టి పన్ను చెల్లింపులు, మిగులు ఇలా..

ఆదాయం వారీగా చెల్లింపులు ఇలా..

ఎప్పటిలాగే 0 నుంచి రూ.2.5 లక్షల ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను లేదు. రూ.2.5-5 లక్షలు ఆదాయం ఉంటే 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే అనేక మినహాయింపుల కారణంగా 5 లక్షల స్లాబులోని వారు పన్ను చెల్లించాల్సిన పనిలేదు. కొత్త విధానంలోనూ ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదు.

స్లాబుల వారీగా తగ్గింపు

ఐచ్ఛిక విధానం..

అయితే కొత్త విధానంలోనే పన్ను చెల్లింపులు చేయాలనే నిబంధనేదీ లేదు. ఇది పూర్తిగా పన్ను చెల్లింపుదారుని ఇష్టానికి వదిలేసింది కేంద్రం. పాత విధానంలోనూ పన్ను చెల్లింపులు చేయొచ్చు.

షరతులివే..

కానీ కొత్త విధానం ప్రకారం పన్ను రేట్లలో చెల్లించాలంటే ఎలాంటి మినహాయింపులు పొందరాదనే షరతు పెట్టింది కేంద్రం. అంతేకాకుండా ఒకసారి కొత్త విధానాన్ని ఎంచుకుంటే తర్వాత ఏడాది కూడా అలాగే చెల్లించాల్సి ఉంటుంది.

సరళీకరణే లక్ష్యంగా..

పన్ను చెల్లింపులో సరళీకరణపై కేంద్రం ప్రధానంగా దృష్టి పెట్టింది. పన్ను చెల్లింపుల్లో మధ్యవర్తుల జోక్యం తగ్గించేలా తాజా విధానాన్ని రూపొందించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు. అయితే ప్రస్తుతం ఇస్తున్న మినహాయింపులకు క్రమంగా స్వస్తి పలుకుతామన్నారు.

ప్రస్తుతం మొత్తంగా 100 మినహాయింపులు ఇస్తోంది ప్రభుత్వం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇందులోని 70 మినహాయింపులను తొలగించింది. ఇంటి అద్దె, జీవిత బీమా, భవిష్య నిధి, పింఛను ​చందాలకు సంబంధించిన తగ్గింపులను తొలగించాలని బడ్జెట్​లో ప్రతిపాదించారు.

Last Updated : Feb 28, 2020, 7:18 PM IST

ABOUT THE AUTHOR

...view details