తెలంగాణ

telangana

ETV Bharat / business

'వృద్ధి' చిక్కులతో పన్ను తగ్గింపుపై ఆశలు - వృద్ధికి ఊతం

వృద్ధి సూచీలు నేలచూపులు చూస్తున్నాయి. నిరుద్యోగం లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి. వర్షపాతం తగిన స్థాయిలో ఉండదన్న అంచనాలు కలవరపెడుతున్నాయి. ఇలాంటి సంక్లిష్టతల మధ్య బడ్జెట్​ ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు నిర్మలా సీతారామన్​. ఈ సవాళ్లను ఎదుర్కొంటూ, వృద్ధికి ఊతమిచ్చేలా ఆమె ఎలాంటి చర్యలు ప్రతిపాదిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

సామాన్యుడికి చేయూతతోనే వృద్ధికి ఊతం!

By

Published : Jul 3, 2019, 6:01 PM IST

Updated : Jul 4, 2019, 5:53 AM IST

దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం కీలక సవాళ్లు ఎదుర్కుటోంది. వినియోగ గిరాకీ తగ్గిపోవటం, ఎగుమతులు క్షీణించటం వంటి కారణాలతో ప్రగతి రథం నెమ్మదిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వృద్ధి 5.8 శాతానికి పడిపోయింది. పూర్తి సంవత్సరానికి చూస్తే వృద్ధి 6.8 శాతానికి తగ్గింది. గత ఐదేళ్లలో ఇదే అత్యల్ప వృద్ధి.

సాధారణం కన్నా తక్కువ వర్షపాతం

ఈసారి వర్షపాతం సాధారణం కంటే తక్కువ నమోదవుతుందని భారత వాతావారణ శాఖ అంచనా వేస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థకు మూలాధారమైన వ్యవసాయం రంగంపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది.

వ్యవసాయ రంగం దెబ్బతింటే..

వ్యవసాయ రంగం దెబ్బతింటే..

వ్యవసాయం రంగం దెబ్బతింటే ఆ ప్రభావం ఇతర రంగాలపై పడుతుంది. ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగి ఇతర వస్తువులపై ప్రజలు చేసే ఖర్చు తగ్గిపోతుంది. ఫలితంగా వినియోగ గిరాకీ పడిపోతుంది. ఆర్థిక వృద్ధి క్షీణిస్తుంది.

ఎలా ముందుకు..?

ప్రగతి రథానికి ఊతమిచ్చేందుకు వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించడం కీలకం అంటున్నారు నిపుణులు. ఆ దిశలోనే చర్యలు ఉంటాయని కేంద్రం కొన్ని సంకేతాలు కూడా ఇచ్చింది. బడ్జెట్ సన్నాహకాల్లో భాగంగా వ్యవసాయ రంగ నిపుణులతో జరిగిన భేటీలో నిర్మలా సీతారామన్... వ్యవసాయం ప్రభుత్వ ప్రాధాన్య రంగమని వ్యాఖ్యానించారు. ఈ భేటీలో గ్రామాల్లో మౌలికవసతులు కల్పన, ఉద్యోగ కల్పనపై ఆర్థిక మంత్రి దృష్టి సారించారు.

దేశ ఆర్థిక వృద్ధి నెమ్మదిస్తున్న వేళ ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెంచడం సహా.. పారిశ్రామిక రంగానికి కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశం ఉందన్నది నిపుణుల అంచనా. తద్వారా నిరుద్యోగ సమస్యనూ తగ్గించొచ్చ వచ్చన్నది వారి విశ్లేషణ.

వినియోగ గిరాకీ పెంచాలి..

ఆర్థిక వ్యవస్థ గాడి తప్పటానికి కారణం వినియోగ గిరాకీ పడిపోవటం. ప్రజల వద్ద ఖర్చు పెట్టటానికి వీలున్న మొత్తాన్ని పెంచటం ద్వారా గిరాకీ పెరుగుతుంది. ఇందుకోసం పన్నులు తగ్గించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న గరిష్ఠ ఆదాయ పన్ను రేటును 30 నుంచి 25 శాతానికి తగ్గించాలన్న డిమాండ్లు ఉన్నాయి.
వినియోగ గిరాకీ పెంచేందుకు నిరుద్యోగాన్ని తగ్గించడం మరో మార్గం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరం కూడా. అందుకోసం బడ్జెట్​లో ఎలాంటి ప్రకటనలు ఉంటాయన్నది ఆసక్తికరం.

ఎన్​బీఎఫ్​సీల సంక్షోభం

ఎన్​బీఎఫ్​సీల సంక్షోభం

వినియోగ గిరాకీ తగ్గిపోవటానికి మరో కారణం బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో నెలకొన్న సంక్షోభం. ఈ సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం బడ్జెట్ ద్వారా చర్యలు తీసుకుంటుందని అంచనా.

ఇదీ చూడండి: పద్దు 2019: రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యం!

Last Updated : Jul 4, 2019, 5:53 AM IST

ABOUT THE AUTHOR

...view details