ప్రభుత్వానికి ఆదాయం సమకూరే మార్గాల్లో ప్రధాన పాత్ర పోషించేవి పన్నులు. అయితే.. గతేడాది కొవిడ్ కారణంగా పన్నుల ద్వారా వచ్చే ఆదాయం భారీగా తగ్గింది. లాక్డౌన్లు తదననంతర పరిణామాలతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల ప్రారంభంలో 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర సమాయత్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో పన్ను రేట్లపై కోత విధించాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు సలహా ఇస్తే విచిత్రంగానే అనిపిస్తుంది. కానీ, చాలా మంది ఆర్థికవేత్తలు ఇప్పుడు ఇదే సూచిస్తున్నారు.
భారీ నష్టాలు..
ఆర్థికవ్యవస్థను పునురుద్ధరించడం, వనురులను పెంపొందించడం.. అనేవి ఆర్థిక మంత్రిత్వ శాఖ ముందు ఉన్న రెండు అతిపెద్ద సవాళ్లు. కొవిడ్ కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ పతనమవడమే కాదు.. జీడీపీ వృద్ధి కూడా పడిపోయింది.
- గత రెండేళ్లుగా భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగుతుండగా.. కొవిడ్ మహమ్మారి మరింత దెబ్బ తీసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21)లో జీడీపీలో 8 శాతం క్షీణత నమోదవుతుందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేంద్రం, రాష్ట్రాల రెవెన్యూ వసూళ్ల ఆధారంగా వారు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
- అధికారిక సమాచారం ప్రకారం... ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కేంద్రానికి బడ్జెట్లో 37 శాతం మాత్రమే ఆదాయం(పన్ను, పన్నేతర, రెవెన్యూ, ఇతర మార్గాల్లో) సమకూరింది.
- సంఖ్యాపరంగా చూస్తే ఇది రూ.8.31 లక్షల కోట్లుగా ఉంది. కాగా.. భారత్ ఈ మార్గాల్లో రూ.22.46 లక్షల కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా వేసింది.
- గతేడాది ఇదే సమయంలో సమకూరిన ఆదాయం... మొత్తం బడ్జెట్లో యాభై శాతంగా ఉండటం గమనార్హం.
ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నందున.. పన్నుల వసూళ్లు పెరుగుతాయి. కానీ, కొరత కూడా ఉంటుందని పాలసీ థింక్ ట్యాంక్ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ చరణ్ సింగ్ అన్నారు. అయితే.. ఈ 9 నెలల్లో జరిగిన నష్టం రానున్న మూడునెలల్లో భర్తీ అవ్వలేదని ఆయన తెలిపారు.
పన్ను, పన్నేతర ఆదాయానికి గండి..