తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆశల పద్దు: 'తుక్కు పాలసీతో 'ఆటో'కు నయా జోష్​' - బడ్జెట్​పై వాహన రంగం అంచనాలు

ప్రజలను తమ పాత వాహనాలను మార్చుకోమని ఒత్తిడి చేయడం కన్నా.. ఆ దిశగా ప్రోత్సహించడం మేలని ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య (ఫాడా) పేర్కొంది. ఇందుకోసం వాహనాదారును ఉద్దేశించి 'స్వచ్ఛంద స్క్రాపేజీ(తుక్కు)' పాలసీని తీసుకురావాని కేంద్రానికి సూచించింది. 2021-22 బడ్జెట్​లో ఆ దిశగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ నిర్ణయాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేసింది.

Fada on new scrappage policy
పాత వాహనాల తుక్కుకోసం ఫాడా సూచనలు

By

Published : Jan 24, 2021, 5:56 PM IST

సంపన్న వర్గాలు ఎల్​పీజీ రాయితీని వదులుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన 'గివ్​ ఇట్ అప్​' కార్యక్రమం తరహాలోనే.. వాహనదారుల కోసం 'స్వచ్ఛంద స్క్రాపేజ్(తుక్కు)​ పాలసీ'ని తీసుకురావాలని ఆటో మొబైల్ డీలర్ల సమాఖ్య (ఫాడా) కేంద్రాన్ని కోరింది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న 2021-22 సార్వత్రిక బడ్జెట్​లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అలాంటి పథకంతో ముందుకు రావాలని సూచించింది.

వాహనదారులు తమ పాత వాహనాలను మార్చుకోమని ఒత్తిడి చేయడం కన్నా.. వారిని ఆ దిశగా ప్రోత్సహించడం ఉత్తమమైన ఆలోచన అని ఫాడా అభిప్రాయపడింది. వంట గ్యాస్​ సబ్సీడి వదులుకోమని ప్రధాని ఇచ్చిన పిలుపునకు వచ్చిన స్పందనతో ఈ విషయం రుజువైందని గుర్తుచేసింది.

మెరుగైన ఫలితాల కోసం.. 2000 మార్చి 31 వరకు రిజిస్టరైన వహనాలన్నింటికీ ఈ విధానాన్ని అమలు చేయాలని సూచించింది.

'ఈ పథకానికి ఆర్థిక ప్రోత్సాహకాలు తోడైతే.. అభివృద్ధి చెందిన దేశాల్లానే తక్షణమే దాని ఫలితాలు కనిపిస్తాయి. సింగిల్​ విండో ఫ్లీట్​ మోడ్రనైజేషన్ ద్వారా పాత వాహనాలను మార్చుకునేందుకు.. రాయితీలు, ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల అమెరికా, కెనడా, బ్రిటన్​, ఇటలీ వంటి దేశాల్లో ఈ పథకం విజయవంతమైంది' అని ఫాడా వివరించింది.

డిమాండ్​పైనే బడ్జెట్ దృష్టి సారించాలి..

"అన్​లాక్​ మార్గదర్శకాలతో సరఫరా వేగంగా కోలుకుంటోంది. డిమాండ్​ మాత్రం ఇంకా పుంజుకోవాల్సి ఉంది" అని ఫాడా పేర్కొంది. ఇందుకోసం బడ్జెట్​లో ప్రభుత్వం డిమాండ్​ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఆటోమొబైల్ డీలర్లు.

2021-22 బడ్జెట్​లో కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేలా, వినియోగ డిమాండ్ పెరిగేలా ప్రభుత్వ చర్యలుండాలి అంటున్నారు.

పండుగ సీజన్​, ఈ ఏడాది ఆరంభం నుంచి ధరలు పెరగనున్నాయన్న కారణంతో 2020-21లో తొలిసారి వాహన విక్రయాలు డిసెంబర్​లో సానుకూలంగా నమోదైట్లు ఫాడా తెలిపింది. దేశవ్యాప్తంగా 1,477 ప్రాంతీయ రవాణా కార్యలయాల్లో​ (ఆర్​టీఓ) వాహనాల రిజిస్ట్రేషన్​లు 11.01 శాతం పెరిగినట్లు పేర్కొంది.

గత ఏడాది ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్​ఐ) పథకం పరిశ్రమకు అవకాశాలు పెంచిందని ఫాడా పేర్కొంది. రానున్న బడ్జెట్​లో ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలను ఆర్థిక మంత్రి వివరిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి:పద్దు 2021-22: 'ఆరోగ్య' భారతానికి ఊతమిస్తారా?

ABOUT THE AUTHOR

...view details