తెలంగాణ

telangana

ETV Bharat / business

భారత్ బడ్జెట్ : త్వరలో స్మార్ట్ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు - భారత కేంద్ర బడ్జెట్ 2020

రానున్న మూడేళ్లలో.. సంప్రదాయ విద్యుత్ మీటర్ల స్థానంలో.. స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు తెచ్చేందుకు నిర్ణయించినట్లు విత్తమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ విధానాన్ని ఎంచుకోడానికి వినియోగదారులకు అవకాశం కల్పిస్తామన్నారు. నేషనల్ మిషన్ ఫర్ క్వాంటం టెక్నాలజీ, అప్లికేషన్​ అమలుకు వచ్చే ఐదేళ్లలో రూ.8 వేల కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. లక్ష గ్రామాలను డిజిటల్ అనుసంధానంలోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

Nirmala Sitharaman on infra structure Budget 2020
భారత్ బడ్జెట్ : త్వరలో స్మార్ట్ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు

By

Published : Feb 1, 2020, 1:31 PM IST

Updated : Feb 1, 2020, 2:37 PM IST

వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా విద్యుత్‌ ప్రీపెయిడ్‌ మీటర్లు తెస్తున్నట్లు బడ్జెట్​ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. విద్యుత్‌ రంగంలో వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా ప్రీపెయిడ్‌ మీటర్లు తెస్తామని ప్రకటించారు. నేషనల్‌ గ్యాస్‌ గ్రిడ్‌ను 16,300 కిలోమీటర్ల నుంచి 27 వేల కిలోమీటర్లకు పెంచే దిశగా చర్యలు చేపడతామని ప్రకటించారు. దేశ వ్యాప్తంగా డేటా సెంటర్‌ పార్కుల ఏర్పాటుకు నిర్ణయిస్తున్నామన్న ఆర్థికమంత్రి... ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, ఫైనాన్షియల్‌ టెక్నాలజీలో నూతన సంస్కరణకు మరిన్ని చర్యలు చేపడతామని అన్నారు.

లక్ష గ్రామాలకు ఓఎఫ్‌సీ(ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ) ద్వారా డిజిటల్‌ కనెక్టివిటీ చేస్తామని స్పష్టం చేశారు. జాతీయ గ్రిడ్‌తో లక్ష గ్రామాలకు అనుసంధానిస్తామన్న సీతారామన్.. అంగన్‌వాడీలు, పాఠశాలలు, గ్రామపంచాయతీలు, పోలీసుస్టేషన్లకు డిజిటల్‌ అనుసంధానం చేస్తామన్నారు. భారత్‌ నెట్‌ పథకానికి రూ.6 వేల కోట్లు కేటాయిస్తామని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.

భారత్ బడ్జెట్ : త్వరలో స్మార్ట్ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు

ఇదీ చదవండి:రైతు సంక్షేమమే తొలి ప్రాధాన్యంగా 'నిర్మలా' పద్దు​

Last Updated : Feb 1, 2020, 2:37 PM IST

ABOUT THE AUTHOR

...view details