తెలంగాణ

telangana

ETV Bharat / business

నవభారత నిర్మాణం- స్థిరమైన ప్రయాణం - లోక్​సభ

బడ్జెట్​ 2019

By

Published : Jul 5, 2019, 10:13 AM IST

Updated : Jul 5, 2019, 1:25 PM IST

2019-07-05 13:14:49

బడ్జెట్​ ప్రసంగం పూర్తి...

కోట్లాది మంది ప్రజల ఆశల మధ్య... ఆర్థిక సవాళ్ల నడుమ తొలిసారి బడ్జెట్​ ప్రవేశ పెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రజలకు భారీ తాయిలాల ప్రకటన లేదు... మధ్యతరగతి ప్రజలు ఊహించిన పన్ను మినహాయింపు లేదు.. అయినప్పటికీ నవభారత నిర్మాణానికై స్థిరమైన ప్రయాణానికి కావాల్సిన కచ్చితమైన ప్రణాళికలు, అవసరమైన మార్గదర్శకాలను ప్రస్తావించారు సీతారామన్. వ్యవసాయం,  అంకుర వ్యాపారం, పెట్టుబడులు, విద్య, తదితర రంగాలపై మాత్రం వరాల జల్లు కురిపించారు.

అత్యధిక మెజార్టీతో దేశంలో రెండోసారి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీఏ 2.0 ప్రభుత్వం వార్షిక బడ్జెట్​ను లోక్​సభలో ప్రవేశపెట్టింది. తొలి పూర్తి స్థాయి  మహిళా ఆర్థిక మంత్రిగా బడ్జెట్​ను ప్రభావవంతంగా ప్రవేశపెట్టారు సీతారామన్​. అన్ని రంగాలపై పూర్తి స్థాయి అవగాహనతో... వాస్తవ పరిస్థితుల చట్రంలోనే బడ్జెట్ ఉన్నట్లు అనిపిస్తోంది. 

భారీ తాయిలాలు, హామీలతో ప్రజలను ఆశల ఊహల పల్లకి ఎక్కించకుండా... వాస్తవ పరిస్థితుల మధ్య పక్కా ప్రణాళికలను ప్రకటించారు విత్త మంత్రి.

వ్యవసాయం, వ్యాపారం, అంతరిక్షం, విద్య, ఉద్యోగం, గ్రామీణ భారతం, ఆరోగ్యం సహా పలు విషయాల్లో వాస్తవిక హామీలను కురింపించింది మోదీ 2.0 సర్కారు.  
 

2019-07-05 13:12:07

జీఎస్టీతో ప్రజలకు లబ్ధి..

" జీఎస్టీతో ఒకే దేశం- ఒకే విపణి- ఒకే పన్ను సాకారం అయింది. జీఎస్టీ శ్లాబుల సరళీకరణతో వినియోగదారులకు రూ.95 వేల కోట్లు ఊరట కలిగింది. " - ఆర్థికమంత్రి. 

2019-07-05 13:09:44

సుంకాలు పెంపు

వార్షిక ఆదాయం రూ.5 కోట్లు దాటిన వారికి సర్‌ఛార్జి పెంపు. బంగారంపై కస్టమ్స్‌ సుంకం 10 నుంచి 12.5 శాతానికి పెంపు. లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై ఒక రూపాయి అదనపు సుంకం విధించనున్నాం. సర్వీస్‌ ట్యాక్స్‌, పరోక్ష పన్నుల పాత కేసుల పరిష్కారానికి ప్రత్యేక పథకం తీసుకొస్తాం. - ఆర్థికమంత్రి. 

2019-07-05 13:04:04

ఐటీ రిటర్న్స్‌

పాన్ లేకపోయినప్పటికీ ఐటీ రిటర్న్స్​ దాఖలుకు వెసులు బాటు కల్పిస్తున్నాం. పాన్​ లేదా ఆధార్​తో దాఖలు చేసుకోవచ్చు. - ఆర్థికమంత్రి. 

2019-07-05 13:02:23

లావాదేవీలు

" బ్యాంకు ఖాతా నుంచి ఏడాదికి రూ.కోటి నగదు ఉపసంహరణ పరిమితి విధిస్తున్నాం. నగదు ఉపసంహరణ పరిమితి రూ.కోటి దాటితే 2 శాతం టీడీఎస్‌ ఉంటుంది. డిజిటల్‌ చెల్లింపులపై ఖాతాదారులు, వ్యాపారుల ఛార్జీలను రద్దు చేస్తున్నాం. " - ఆర్థికమంత్రి 

2019-07-05 12:47:50

పన్నులు

" గడిచిన ఏడాదిలో మొండి బకాయిలు రూ.లక్ష కోట్లు తగ్గాయి. రూ.5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. విద్యుత్‌ వాహనాల కొనుగోలు రుణాల వడ్డీపై రూ.1.5 లక్షల వరకు ఆదాయపన్ను రాయితీ ఇవ్వనున్నాం. కార్పొరేట్‌ పన్ను పరిధి రూ.250 కోట్ల టర్నోవర్‌ నుంచి రూ.400 కోట్లకు పెంచనున్నాం. రూ.400 కోట్ల టర్నోవర్‌ ఉన్న కంపెనీలకు 25 శాతం పన్ను విధిస్తున్నాం. రూ.2.5 లక్షల వరకు విద్యుత్‌ వాహనాల కొనుగోలుపై వడ్డీ రాయితీ ఉంటుంది."  - ఆర్థికమంత్రి. 

2019-07-05 12:41:22

విద్యుత్‌ వాహనాలు

" విద్యుత్‌ వాహనాలపై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించాలని జీఎస్టీ మండలిని ప్రభుత్వం కోరింది. అంకుర సంస్థలకు పెట్టుబడుల సమీకరణపై ఆదాయపన్ను పరిశీలన ఉండదు. " - ఆర్థికమంత్రి.

2019-07-05 12:33:45

నాణేలు

వచ్చే ఐదేళ్లలో మౌలిక సదుపాయాల రంగానికి రూ.100 లక్షల కోట్లు ఖర్చు పెట్టనున్నాం. పీఎఫ్‌ఆర్‌డీఏ పరిధి నుంచి ఎన్‌పీఎస్‌ పథకం వేరు చేస్తాం. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుంది. ప్రభుత్వ వాటా 51 శాతం కంటే తగ్గకుండా పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగిస్తాం. పెట్టుబడుల ఉపసంహరణతో 2019-20లో రూ.లక్షా 5 వేల కోట్ల సమీకరణ లక్ష్యంగా పెట్టుకున్నాం. దేశ విదేశీ అప్పులు జీడీపీలో 5 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. - ఆర్థికమంత్రి 

2019-07-05 12:31:12

పెట్టుబడులు...

" ఆరు ప్రభుత్వ బ్యాంకులను రుణ సంక్షోభం నుంచి గట్టెక్కించాం. రుణపరపతి పెంచేందుకు బ్యాంకులకు రూ.70 వేల కోట్లు అందివ్వనున్నాం. అపరిచిత నగదు జమ నియంత్రణకు ప్రత్యేక విధానం తీసుకొస్తాం. " -  ఆర్థికమంత్రి. 

2019-07-05 12:27:43

బ్యాంకులు......

" భారత పాస్‌పోర్టు ఉన్న ఎన్‌ఆర్‌ఐలకు ఆధార్‌ కార్డు అందిస్తాం. ఎన్‌ఆర్‌ఐలు స్వదేశానికి వచ్చాక 180 రోజుల కాలవ్యవధి నిబంధన తొలగిస్తాం. స్వదేశానికి రాగానే ఎన్‌ఆర్‌ఐలకు ఆధార్‌ కార్డు అందేలా చర్యలు తీసుకుంటాం. ఆఫ్రికా దేశాల్లో 18 రాయబార కార్యాలయాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇప్పటికే 5 దేశాల్లో రాయబార కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. పర్యాటక రంగానికి ఊతం కోసం దేశవ్యాప్తంగా 17 పర్యాటక ప్రాంతాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతాం." - ఆర్థికమంత్రి

2019-07-05 12:24:09

ఎన్‌ఆర్‌ఐ.......

" గ్రామీణ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు విస్తృత ప్రాధాన్యం ఇస్తున్నాం. యాస్పైర్‌ పథకం ద్వారా 75 వేల మంది నైపుణ్యవంతులైన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దుతాం. దేశవ్యాప్తంగా వృత్తి కళాకారుల కోసం స్ఫూర్తి పేరుతో క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం. స్ఫూర్తి క్లస్టర్ల ద్వారా 50 వేల మంది వృత్తి కళాకారులు లబ్ధిపొందుతారు. " - ఆర్థికమంత్రి. 

2019-07-05 12:20:12

పరిశ్రమలు....

" సోషల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ చేయూతనిచ్చేవిధంగా  ఎలక్ట్రానిక్‌ విధానంలో నిధుల సేకరణ కోసం  సోషల్​ స్టాక్​ ఎక్స్చేంజీ పేరుతో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తాం. కృత్రిమ మేధ, బిగ్‌డేటా, రోబోటిక్స్‌ రంగాల్లో యువత శిక్షణకు ఏర్పాట్లు చేస్తాం. స్టార్టప్‌ల కోసం దూరదర్శన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ఛానల్‌ తీసుకొస్తాం. స్వయం సహాయ బృందాలకు కూడా ముద్ర యోజన వర్తింప జేస్తాం. ప్రతి స్వయం సహాయ బృందంలో ఒకరికి రూ.లక్ష వరకు ముద్ర రుణం అందిస్తాం. " - ఆర్థికమంత్రి. 

2019-07-05 12:14:34

సోషల్​ ఎంటర్​ప్రైజెస్​...

 " ఖేలో ఇండియా ద్వారా దేశవ్యాప్తంగా క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్నాం. ప్రధానమంత్రి కౌశల్‌ యోజన ద్వారా కోటి మందికి నైపుణ్య శిక్షణ అందించాం. " - ఆర్థికమంత్రి

2019-07-05 12:10:55

క్రీడలు

" ఉన్నత విద్యలో సంస్కరణల కోసం నూతన విద్యా విధానం తీసుకొస్తాం. పరిశోధన, ఆవిష్కరణల కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నాం. నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌కు ప్రత్యేక నిధులు కేటాయిస్తాం. నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ద్వారా పరిశోధనలకు చేయూతనివ్వనున్నాం. 

ఐదేళ్ల క్రితం ప్రపంచ అత్యుత్తమ విద్యా సంస్థల్లో భారత్‌ నుంచి ఒక్కటీ లేదు. ప్రస్తుతం అత్యుత్తమ విద్యా సంస్థల్లో 3 సంస్థలు చోటు సంపాదించాయి. ఉన్నత విద్యా కేంద్రంగా ఎదిగేందుకు భారత్‌కు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మన ఉన్నత విద్యా సంస్థల్లోకి విదేశీ విద్యార్థుల రాక మరింత పెరగాలి. ఏడాదిలోగా ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పాటు చేస్తాం. " - ఆర్థికమంత్రి 

2019-07-05 12:04:50

విద్యా విధానం

" ప్రధానమంత్రి డిజిటల్‌ సాక్షరత యోజన ద్వారా2 కోట్ల మందికి గ్రామీణ యువతకు శిక్షణ అందించాం. శరవేగంగా జరుగుతున్న పట్టణీకరణను సవాల్‌గా కాకుండా అవకాశంగా చూస్తున్నాం. " - ఆర్థికమంత్రి.  

2019-07-05 12:04:19

డిజిటల్‌ విద్య

" స్వచ్ఛభారత్‌ అభియాన్‌ ద్వారా9.6 కోట్ల శౌచాలయాల నిర్మించాం. 5.6లక్షల గ్రామాలను ఓడీఎఫ్‌గా ప్రకటించాం" - ఆర్థికమంత్రి

2019-07-05 12:02:05

డిజిటల్‌ విద్య

" జలవనరుల విభాగాలన్నీ సమీకృతం చేస్తూ జల్‌శక్తి మంత్రాలయ్‌ ఏర్పాటు చేస్తాం. జలజీవన్‌ మిషన్‌ ద్వారా 2024 నాటికి దేశంలోని ప్రతి ఇంటికీ రక్షిత నీరు అందిస్తాం. ఇప్పటికే ఉన్న రాష్ట్రాల పథకాలతో కలిసి లక్ష్యం దిశగా జలజీవన్‌ కొనసాగుతుంది. వాన నీటి సంరక్షణ, గృహ నీటి శుద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నాం. ఇళ్ల నుంచి వచ్చే నీటిని సాగుకు వాడేందుకు ప్రత్యేక పథకం తీసుకొస్తాం. " - ఆర్థికమంత్రి 

2019-07-05 11:59:15

స్వచ్ఛభారత్‌.....

" మత్స్యకారుల కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన తీసుకురానున్నాం. విమానయానం,మీడియా,యానిమేషన్‌ రంగాల్లో ఎఫ్‌డీఐల ప్రతిపాదనలను పరిశీలిస్తాం. రైతు ఉత్పత్తి సంఘాలకు మరింత చేయూతనిస్తాం. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. పప్పు ధాన్యాల ఉత్పత్తిలో రైతులు స్వయం సమృద్ధి సాధించి దిగుమతుల భారం తగ్గించారు.  దిగుమతుల భారాన్ని తగ్గించడం ద్వారా విదేశీ చెల్లింపుల భారం తగ్గింది. " - ఆర్థికమంత్రి 

2019-07-05 11:55:43

జలమిషన్‌......

" ప్రపంచంలోనే భారత్‌ సరికొత్త అంతరిక్ష శక్తిగా అవతరిస్తోంది. ఇస్రో సేవలను వాణిజ్యపరంగాను వృద్ధి చేసేందుకు న్యూస్పేస్​ ఇండియా పేరుతో ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేస్తాం. అంతర్జాతీయంగా ఇస్రో ఉత్పత్తులకు మార్కెటింగ్​ చేయటం సంస్థ లక్ష్యాలుగా ఉంటాయి. " - ఆర్థికమంత్రి.

2019-07-05 11:50:11

మత్స్యకారులు, వ్యవసాయ ఉత్పత్తులు, దిగుమతులు .....

" 2018-30 మధ్య రైల్వేల ఆధునికీకరణకు రూ.50 లక్షల కోట్లు కావాలి. ప్రయాణ, సరుకు రవాణా సేవల మెరుగు కోసం పీపీపీ విధానంలో ముందుకెళ్తాం." - ఆర్థికమంత్రి 

2019-07-05 11:46:50

ఇస్రో....

' చిల్లర వర్తకుల కర్మయోగి మాన్‌ధన్‌ యోజన పేరుతో పింఛను పథకం తీసుకొస్తాం. " - ఆర్థిక మంత్రి 

2019-07-05 11:45:15

రైల్వేలు...

" దేశానికి విదేశీ పెట్టుబడుల రాక స్థిరంగా కొనసాగుతోంది. అన్ని దేశాల్లో ఎఫ్‌డీఐలు తగ్గినప్పటికీ భారత్‌పై ఆ ప్రభావం పడలేదు. మేకిన్ ఇన్‌ ఇండియా విధానం సంపదను సృష్టిస్తోంది. " - ఆర్థికమంత్రి

2019-07-05 11:43:20

విద్యుత్‌, ఇళ్లు....

"భారత్‌మాల,సాగర్‌మాల, ఉడాన్ పథకాలు గ్రామీణ- పట్టణ ప్రాంతాల మధ్య దూరం తగ్గించనున్నాయి. భారత్‌మాల పథకం ద్వారా రహదారులను పెద్దఎత్తున అభివృద్ధి చేస్తున్నాం. దేశానికి విదేశీ పెట్టుబడుల రాక స్థిరంగా కొనసాగుతోంది. అన్ని దేశాల్లో ఎఫ్‌డీఐలు తగ్గినప్పటికీ భారత్‌పై ఆ ప్రభావం పడలేదు. మేకిన్ ఇన్‌ ఇండియా విధానం సంపదను సృష్టిస్తోంది." - ఆర్థికమంత్రి 

2019-07-05 11:41:41

'చిల్లర వర్తకులకు పింఛను'

" భారతీయ సంస్థలు పెద్దఎత్తున ఉపాధి కల్పిస్తూ, సంపద సృష్టిస్తున్నాయి. మినిమమ్‌ గవర్నమెంట్, మాగ్జిమమ్‌ గవర్నెన్స్ మా విధానం. పరిశ్రమలకు అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం చేస్తాం. నవభారత్‌ నిర్మాణానికి 10 సూత్రాల విధానంతో ముందుకెళ్తాం. దేశ రవాణా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నాం. " -  ఆర్థికమంత్రి

2019-07-05 11:39:54

'విదేశీ పెట్టుబడులు స్థిరం'

" విద్యుత్‌ వాహనాలకు ప్రత్యేక రాయితీలు ఇస్తాం. వృద్ధిరేటు పెంచేందుకు భారీగా మౌలిక వసతులు ప్రాజెక్టులు చేపట్టాం. దేశ ఆర్థివ్యవస్థకు మౌలిక వసతుల ప్రాజెక్టులు జీవనరేఖలు."  - ఆర్థికమంత్రి 

2019-07-05 11:38:16

'దూరం తగ్గింది'

" దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో పారిశ్రామిక రంగం కీలకపాత్ర పోషిస్తుంది. భారత్‌ ఇప్పటికే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా అవతరించింది. ఉడాన్ పథకంతో చిన్న పట్టణాలకు కూడా విమాన ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. దేశంలో2018-19మధ్య300కి.మీ.మెట్రో ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చాం. దేశంలో మెట్రో రైలు ప్రాజెక్టు పరిధి 657కి.మీకు పెరగనుంది. " -  ఆర్థికమంత్రి

2019-07-05 11:36:53

'నేషనల్​ ట్రాన్స్​పోర్టు కార్డు'

"భారత్​ 1 ట్రిలియన్​ ఆర్థిక వ్యవస్థగా అవతరించటానికి 55 సంవత్సరాలు పట్టింది. కానీ ప్రజా హృదయాల్లో నమ్మకం, ఆశ ఉండటం మేము ఐదు సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్​ డాలర్లు పెంచగలిగాం " - ఆర్థిక మంత్రి 

2019-07-05 11:33:55

'నవభారత నిర్మాణానికి పది సూత్రాల విధానం'

"ఈ సంవత్సరమే భారత ఆర్థిక వ్యవస్థ 3 ట్రిలియన్​ డాలర్లుగా అవతరిస్తుంది. " - ఆర్థికమంత్రి

2019-07-05 11:31:48

'వృద్ధి రేటు కోసం భారీగా మౌలిక వసతులు'

"2014-19 మధ్య ఆహార భద్రతపై ప్రభుత్వ ఖర్చు రెండు రెట్లు పెరిగింది."  - ఆర్థిక మంత్రి 

2019-07-05 11:29:24

'పారిశ్రామిక రంగం కీలక పాత్ర వహిస్తోంది'

" నవీన భారత రూపకల్పనకు ప్రణాళికలు రచిస్తున్నాం: నిర్మలా సీతారామన్‌ 5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థికవ్యవస్థగా భారత్‌ అవతరించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చేనాటికి భారత్‌ ఆర్థిక వ్యవస్థ రూ. 1.85 ట్రిలియన్​ డాలర్లుగా ఉంది" -  ఆర్థిక మంత్రి

2019-07-05 11:25:20

' 55 సంవత్సరాలు పట్టింది '

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ లోక్​సభలో బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. 

2019-07-05 11:21:25

'ఈ ఏడాదే 3 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థ'

బడ్జెట్​కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 

2019-07-05 11:19:24

ఆహార భద్రతపై....

బడ్జెట్​ ప్రవేశపెట్టటానికి ముందు జరిగే మంత్రి వర్గ భేటీ పార్లమెంటులో మొదలైంది. 

2019-07-05 11:08:15

'గత ఐదేళ్లలో ఆర్థిక వ్యవస్థ 1 బిలియన్​ డాలర్లు పెరిగింది'

ఇది భారతీయ సంప్రదాయం. పాశ్చాత్య భావనలకు వీడ్కోలు చెప్పేందుకు ఇది సరైన పద్ధతి."
--- సుబ్రమణియన్​, ఆర్థికశాఖ ముఖ్య సలహాదారు.

2019-07-05 11:04:50

'నవీన భారతం రూపకల్పనకు ప్రణాళికలు'

కేంద్ర ఆర్థికమంత్రి బడ్జెట్​ ప్రతుల కోసం సూట్​కేసు బదులు ఎర్రటి వస్త్రాన్ని వినియోగించారు. జాతీయ చిహ్నం ఉన్న ఈ ఎర్రటి వస్త్రంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం వద్ద సీతారామన్​ కనిపించారు.

పూర్తి కథనం ఇక్కడ చదవండి... పద్దు 2019: సంప్రదాయం మార్చిన నిర్మల

2019-07-05 11:01:39

బడ్జెట్​ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆ శాఖ సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్​ బడ్జెట్ పత్రాలతో పార్లమెంటుకు చేరుకున్నారు. 

2019-07-05 10:51:52

బడ్జెట్​ను ఆమోదించిన కేంద్ర మంత్రి వర్గం

భారతదేశ తొలిపూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా చరిత్రకెక్కిన నిర్మలాసీతారామన్​ కాసేపట్లో లోక్​సభలో బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్​ పత్రాలతో పార్లమెంటుకు చేరుకున్నారు నిర్మలా సీతారామన్​. 

2019-07-05 10:41:14

పార్లమెంటుకు చేరుకున్న నిర్మలా తల్లిదండ్రులు

భారతదేశ తొలిపూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా చరిత్రకెక్కిన నిర్మలాసీతారామన్​ కాసేపట్లో లోక్​సభలో బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్​ పత్రాలతో పార్లమెంటుకు చేరుకున్నారు నిర్మలా సీతారామన్​. 

2019-07-05 10:37:45

ప్రారంభమైన క్యాబినెట్​ భేటీ

భారతదేశ తొలిపూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా చరిత్రకెక్కిన నిర్మలాసీతారామన్​ కాసేపట్లో లోక్​సభలో బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్​ పత్రాలతో పార్లమెంటుకు చేరుకున్నారు నిర్మలా సీతారామన్​. 

2019-07-05 10:34:46

రాష్ట్రపతిని కలిసిన ఆర్థికమంత్రి

భారతదేశ తొలిపూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా చరిత్రకెక్కిన నిర్మలాసీతారామన్​ కాసేపట్లో లోక్​సభలో బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్​ పత్రాలతో పార్లమెంటుకు చేరుకున్నారు నిర్మలా సీతారామన్​. 

2019-07-05 10:31:38

'ఇది భారతీయ సంప్రదాయం'

భారతదేశ తొలిపూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా చరిత్రకెక్కిన నిర్మలాసీతారామన్​ కాసేపట్లో లోక్​సభలో బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్​ పత్రాలతో పార్లమెంటుకు చేరుకున్నారు నిర్మలా సీతారామన్​. 

2019-07-05 10:24:12

నిర్మల మార్క్...

భారతదేశ తొలిపూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా చరిత్రకెక్కిన నిర్మలాసీతారామన్​ కాసేపట్లో లోక్​సభలో బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్​ పత్రాలతో పార్లమెంటుకు చేరుకున్నారు నిర్మలా సీతారామన్​. 

2019-07-05 10:16:48

పార్లమెంటుకు చేరుకున్న ఆర్థిక మంత్రి

భారతదేశ తొలిపూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా చరిత్రకెక్కిన నిర్మలాసీతారామన్​ కాసేపట్లో లోక్​సభలో బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్​ పత్రాలతో పార్లమెంటుకు చేరుకున్నారు నిర్మలా సీతారామన్​. 

2019-07-05 09:54:41

మరికొద్దిసేపట్లో బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

భారతదేశ తొలిపూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా చరిత్రకెక్కిన నిర్మలాసీతారామన్​ కాసేపట్లో లోక్​సభలో బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్​ పత్రాలతో పార్లమెంటుకు చేరుకున్నారు నిర్మలా సీతారామన్​. 

Last Updated : Jul 5, 2019, 1:25 PM IST

ABOUT THE AUTHOR

...view details