కరోనా వైరస్ ప్రభావంతో అమెరికా డాలర్‌తో పోలిస్తే రికార్డుస్థాయి కనిష్ఠానికి పడిపోయింది బ్రిటన్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్. ఐరోపాలో మహమ్మారి మరింత ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మదుపరులు ముందుజాగ్రత్తగా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ఫలితంగా పౌండ్ ఏకంగా 1.9 శాతం క్షీణించి చివరకు 1.1861 అమెరికన్ డాలర్ వద్ద స్థిరపడింది. 1985 తర్వాత పౌండ్ ఈ స్థాయిలో పతనమవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
'పౌండ్' భారీ పతనం-1985 తర్వాత ఇదే ప్రథమం - US DOLLER
అమెరికా డాలర్‌తో పోలిస్తే రికార్డుస్థాయి కనిష్ఠానికి పడిపోయింది బ్రిటన్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్. ఇవాళ ఒక్కరోజే ఏకంగా 1.9 శాతం క్షీణించింది. కరోనా భయాలతో మదుపరులు పెట్టుబడులను ఉపసంహరించుకోవడమే ఇందుకు కారణం.
'పౌండ్' భారీ పతనం-1985 తర్వాత ఇదే ప్రథమం
చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రపంచదేశాల్లో చాలా వరకు విస్తరించింది. ఈ మహమ్మారి ప్రభావం ఐరోపాలో తీవ్రమైంది. మరణాల్లో ఆసియాను మించింది. ఇప్పటికే ఇటలీలో 2,500 మందికిపైగా మరణించారు. మరో 31వేల మంది కరోనా బారినపడ్డారు.