తెలంగాణ

telangana

ETV Bharat / business

బిట్​ కాయిన్ రికార్డు- 30 వేల డాలర్లపైకి విలువ - బిట్​కాయిన్ అంటే ఏమిటి

బిట్ ​కాయిన్ విలువ కొత్త గరిష్ఠాన్ని తాకింది. శనివారం నాటికి ఒక కాయిన్ విలువ 30,000 డాలర్ల పైకి చేరింది. 2020లో బిట్ ​కాయిన్​ విలువ 300 శాతం పెరిగింది.

Bitcoin Value today
బిట్​కాయిన్ విలువ

By

Published : Jan 3, 2021, 2:38 PM IST

క్రిప్టో కరెన్సీ 'బిట్ ​కాయిన్' రికార్డులతో దూసుకోపోతోంది. శనివారం దీని విలువ 30,000 డాలర్ల (రూ.21,92,767) మార్క్ దాటింది. ఒకానొక దశలో దీని విలువ 14 శాతం పెరిగి.. 33,136.92 డాలర్లుగా నమోదైంది.

గత నెలలోనే తొలిసారి 20 వేల డాలర్ల స్థాయిని దాటిన బిట్ ​కాయిన్.. క్రిస్మస్​ తర్వాత 25 వేల డాలర్ల మార్క్​ అందుకుంది. పది రోజుల్లోపే 30 వేల మార్క్​ను దాటడం విశేషం. బిట్​ కాయిన్​ ప్రస్తుత మార్కెట్ క్యాపిటల్ 611 బిలియన్ డాలర్లు (రూ.44.6 లక్షల కోట్లపైమాటే)గా అంచనా.

కరోనా సంక్షోభంలో బంగారంలానే.. క్రిప్టో కరెన్సీనీ మదుపరులు పెట్టుబడులకు సురక్షితంగా భావించడం, పేపాల్ లాంటి దిగ్గజ సంస్థలు క్రిప్టో కరెన్సీను ప్రోత్సహించటం వంటివి బిట్ ​కాయిన్​ విలువ ఈ స్థాయిలో దూసుకుపోయేందుకు కారణంగా తెలుస్తోంది. మొత్తం మీద 2020లో బిట్ ​కాయిన్​ విలువ 300 శాతానికిపైగా పెరిగింది.

బిట్ ​కాయిన్​ వృద్ధి ఇలా..

సంవత్సరం నెల విలువ (డాలర్లలో)
2011 ఫిబ్రవరి 1
2011 జూన్​ 10
2013 ఏప్రిల్ 100
2013 నవంబర్ 1,000
2017 అక్టోబర్ 5,000
2017 నవంబర్ 10,000
2017 డిసెంబర్ 15,000
2020 డిసెంబర్ 20,000
2020 డిసెంబర్ 25,000
2021 జనవరి 30,000

ఇదీ చూడండి:కోటీశ్వరుడిగా ఎలా మారాలో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details