తెలంగాణ

telangana

ETV Bharat / business

20 రోజుల్లో రూ.79 వేల కోట్ల రుణాలు! - ఎంఎస్​ఎంఈలకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ

'ఆత్మ నిర్భర్​ భారత్' పథకంలోని ప్రత్యేక నిధి ద్వారా ఎంఎస్​ఎంఈలకు రూ.79,000 కోట్ల రుణాలు మంజూరు చేశాయి బ్యాంకులు. జూన్ 1 నుంచి 20 వరకు ఈ మొత్తాన్ని మంజూరు చేసినట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది.

msme loans
ఎంఎస్ఎంఈలకు భారీగా రుణాలు

By

Published : Jun 23, 2020, 5:31 PM IST

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్​ఎఈలకు) బ్యాంకుల ద్వారా జూన్​ 20 నాటికి మొత్తం రూ.79,000 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఎంఎస్​ఎంఈలను ఆదుకునేందుకు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక రుణ లభ్యత పథకం కింద ఈ రుణాలు ఇచ్చినట్లు పేర్కొంది.

ఇప్పటికే రూ.35 వేల కోట్లకుపైగా మొత్తాన్ని లబ్ధిదారులకు అందించినట్లు తెలిపింది ఆర్థిక శాఖ. మొత్తం 19 లక్షల ఎంఎస్​ఎంఈలు, ఇతర వ్యాపారాలు ఈ రుణాలను పొందినట్లు వివరించింది.

ఆత్మ నిర్భర్​ భారత్​లో భాగంగా..

లాక్​డౌన్​ నేపథ్యంలో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు 'ఆత్మ నిర్భర్​ భారత్​' పేరుతో కేంద్రం రూ.20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో ఎంఎస్​ఎంఈలకు అత్యవసర రుణ గ్యారెంటీ పథకం కింద రూ.3 లక్షల కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా బ్యాంకులు ఎంఎస్​ఎంఈలకు జూన్‌ 1 నుంచి రుణాలు ఇస్తున్నాయి.

ఇదీ చూడండి:కరోనాతో భారత్​లో బెర్లిన్ యుద్ధం నాటి స్థితి!

ABOUT THE AUTHOR

...view details