తెలంగాణ

telangana

By

Published : May 20, 2021, 5:57 PM IST

Updated : May 20, 2021, 7:19 PM IST

ETV Bharat / business

త్వరలో 80% మొండి బకాయిల పరిష్కారం?

నిరర్ధక ఆస్తుల(ఎన్‌పీఏ) పరిష్కారంపై కీలక ముందడుగు పడింది. సుమారు 80 పెద్ద ఖాతాలను(మొండిబకాయిలు) బ్యాంకింగ్ వర్గాలు గుర్తించాయి. వీటిని త్వరలోనే నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఐఆర్‌సీఎల్)కు బదిలీ చేసే అవకాశాలున్నాయి.

NPA
మొండి బకాయిలు

బ్యాంకుల్లో పేరుకుపోయిన నిరర్ధక ఆస్తుల(ఎన్‌పీఏ) పరిష్కారం కోసం.. 80 పెద్ద ఖాతాలను నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఐఆర్‌సీఎల్)కు బదిలీ చేసే అవకాశాలున్నాయి. 2021-22 బడ్జెట్‌లో ప్రకటించిన 'బ్యాడ్ బ్యాంకు'నే ఎన్‌ఐఆర్‌సీఎల్​గా వ్యవహరిస్తున్నారు. వచ్చే నెల నుంచి ఇది పనిచేయనుంది.

ఒక్కొక్కటి రూ.500 కోట్లకు పైనే..

బ్యాడ్ బ్యాంక్‌కు బదిలీ చేయాల్సిన 70-80 ఖాతాలను గుర్తించిన బ్యాంకింగ్ వర్గాలు.. ఒక్కో ఎన్‌పీఏ ఖాతా పరిమాణం రూ.500 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలిపాయి. దీనితో దాదాపు రూ.2 లక్షల కోట్లకు పైగా ఎన్‌పీఏలు బ్యాడ్ బ్యాంకుకు బదిలీ అవ్వనున్నాయి. ఈ తీర్మానంలో భాగంగా.. రుణదాతలు అందించే 100 శాతం ఆస్తులను ఎన్‌ఐఆర్‌సీఎల్ స్వాధీనం చేసుకోనుంది.

మోసపూరిత రుణాల తంటా..

ఇక రుణ రికవరీలో 15 శాతం వరకు ఎన్‌ఐఆర్‌సీఎల్ నగదు రూపంలో చెల్లిస్తుంది. 85 శాతానికి ప్రభుత్వం హామీదారుగా ఉండనుంది. అయితే.. మోసపూరిత రుణాలను ఎన్‌ఐఆర్‌సీఎల్‌కు విక్రయించలేమని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఆర్‌బీఐ ప్రకారం.. మార్చి 2020 నాటికి సుమారు రూ.1.9 లక్షల కోట్ల మోసపూరిత రుణాలున్నాయి.

ది ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం బ్యాడ్ బ్యాంకును ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే అసెట్ రీకన్‌స్ట్రక్షన్ సంస్థ(ఏఆర్​సీ), అసెట్ నిర్వహణ సంస్థ (ఏఎమ్​సీ)లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

ఇవీ చదవండి:వ్యయం పెరిగితేనే ఆర్థికానికి ఊపు

కరోనాపై పోరు: గ్రామీణ భారతానికి కేంద్రం నిధులు

వచ్చే నెల 'బ్యాడ్​ బ్యాంక్' షురూ!

Last Updated : May 20, 2021, 7:19 PM IST

ABOUT THE AUTHOR

...view details