తెలంగాణ

telangana

ETV Bharat / business

రుణ గ్రహీతలకు సుప్రీం తాత్కాలిక ఉపశమనం - moratorium

అప్పుల ఖాతాలను నిరర్ధక ఆస్తుల కింద ప్రకటించవద్దని బ్యాంకులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మారటోరియం సమయంలో వడ్డీపై వడ్డీని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన అనంతరం ఈ తీర్పును వెలువరించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు ఇది కొనసాగుతుందని పేర్కొంది. దీంతో రుణ గ్రహీతలకు తాత్కాలిక ఉపశమనం కలిగింది.

Bank shouldn't declare accounts as NPAs until disposal of pleas seeking moratorium extension: SC
రుణ గ్రహీతలకు సుప్రీంకోర్టు తాత్కాలిక ఉపశమనం

By

Published : Sep 3, 2020, 11:00 PM IST

రుణ గ్రహీతలకు తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తూ.. రుణ ఖాతాలను బ్యాంకులు నిరర్ధక ఆస్తుల(ఎన్​పీఏ) కింద ప్రకటించవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 31 వరకు నిరర్ధక ఆస్తులుగా గుర్తించని ఖాతాలకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.

ఆర్​బీఐ విధించిన మారటోరియం సమయంలో వడ్డీపై వడ్డీని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది జస్టిస్​ అశోక్​ భూషణ్​, జస్టిస్​ ఆర్​ ఎస్​ రెడ్డి, జస్టిస్​ ఎమ్​ఆర్​ షా ధర్మాసనం. తదుపురి ఆదేశాలు ఇచ్చేంతవరకు ఇదే తీర్పు కొనసాగుతుందని స్పష్టం చేసింది. సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా అభ్యర్థన మేరకు తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.

రుణ గ్రహీతలకు ఉపశమనం కల్పించడం బ్యాంకుల చేతిలో ఉందా?లేదా? అన్న విషయాన్ని ఆర్​బీఐ స్పష్టం చేయాలని సూచించింది సుప్రీం. మారటోరియంలో వడ్డీపై వడ్డీ విషయంపైనా స్పందించాలని పేర్కొంది.

ఇదీ చూడండి:-'వడ్డీ వసూలు చేస్తే మారటోరియంకు అర్థమేముంది?'

ABOUT THE AUTHOR

...view details