తెలంగాణ

telangana

ETV Bharat / business

రియల్​టైమ్ లావాదేవీల్లో అగ్రస్థానానికి భారత్!

రియల్​ టైమ్ ఆర్థిక లావాదేవీల్లో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానానికి చేరింది. ఓ అంతర్జాతీయ సంస్థ తాజా సర్వే ప్రకారం దేశంలో ప్రస్తుతం రోజుకు 4.1 కోట్ల రియల్​టైమ్ లావాదేవీలు జరుగుతున్నాయి.

Huge increase in Real time transactions in India
రియల్​టైమ్ లావాదేవీల్లో అగ్రస్థానానికి భారత్

By

Published : Oct 7, 2020, 6:18 PM IST

కరోనా మహమ్మారి వల్ల.. దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు భారీగా పెరిగాయి. రియల్​టైమ్ పేమెంట్స్ పరంగా రోజుకు 4.1 కోట్ల లావాదేవీలతో భారత్ అగ్రస్థానంలో నిలిచినట్లు ఓ అంతర్జాతీయ సర్వేలో తేలింది. గత ఏడాదితో పోలిస్తే రియల్​ టైమ్ లావాదేవీలు రెండింతలకన్నా అధికంగా పెరిగినట్లు వెల్లడైంది. భారత్​తో పాటు మరో ఆరు దేశాల్లోనూ రెట్టింపునకు మించి రియల్​ టైమ్ లావాదేవీలు నమోదయ్యాయని.. అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ 'ఎఫ్​ఐఎస్​' నివేదిక వివరించింది.

నివేదిక ముఖ్యాంశాలు..

  • రియల్​టైమ్ లావాదేవీల్లో వృద్ధి రేటు పరంగా చూస్తే మాత్రం బెహ్రయిన్ (657 శాతం), ఘనా (488 శాతం), ఫిలిప్పీన్స్ (309 శాతం), ఆస్ట్రేలియా (214 శాతం), పోలాండ్ (208 శాతం) అగ్రస్థానంలో ఉన్నాయి.
  • రియల్​టైమ్ పేమెంట్​లలో భారత్ 213 శాతం వృద్ధి రేటును సాధించింది.
  • దక్షిణ కొరియాలో ఏడాదికి తలసరి లావాదేవీల సంఖ్య 75గా ఉంది.
  • చైనాలో 3.8 కోట్లు, దక్షిణ కొరియాలో 1.2 కోట్ల రియల్​టైమ్ లావాదేవీలు(రోజుకు) జరుగుతున్నాయి.

ఇదీ చూడండి:కాపీ రైట్​ కేసులో సుప్రీం కోర్టుకు గూగుల్, ఒరాకిల్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details