ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు కరోనాను ఎదుర్కొనేందుకు కావాల్సిన నిధులపై కీలక నిర్ణయం తీసుకుంది ప్రపంచ బ్యాంకు. రానున్న 15 నెలల్లో ప్రపంచ దేశాలకు 160 బిలియన్ డాలర్ల అత్యవసర సహాయాన్ని అందించే ప్రణాళికకు ఆమోదం తెలిపింది.
ఇందులో భాగంగా తొలి విడతలో 1.9 బిలియన్ డాలర్ల సహాయక నిధిని 25 దేశాలకు అందించనున్నట్లు ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. మరో 40 దేశాలకు సహాయం అందించే విధంగా కార్యకలాపాలు సాగుతున్నట్లు పేర్కొంది.
అత్యంత పేద దేశాలు, కరోనా వల్ల ప్రమాదం పొంచి ఉన్న దేశాలపై అధిక దృష్టి సారిస్తున్నట్లు ప్రపంచ బ్యాంక్ స్పష్టం చేసింది.