తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఈ ఏడాది భారత వృద్ది రేటు -5.9 శాతం' - చైనా ఆర్థిక వ్యవస్థపై ఐరాస అంచనాలు

భారత ఆర్థిక వృద్ధి రేటు ఈ ఏడాది -5.9 శాతంగా ఉండొచ్చని ఐరాస అంచనా వేసింది. కరోనాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు ఇందుకు కారణంగా వెల్లడించింది. ఇదే సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా 4.3 శాతం ప్రతికూల వృద్ధి రేటును నమోదు చేయొచ్చని తెలిపింది.

Corona impact on India Economy
భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా తీవ్ర ప్రభావం

By

Published : Sep 23, 2020, 3:06 PM IST

కరోనా సంక్షోభం ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడినట్లు ఐరాస తెలిపింది. ఫలితంగా భారత్ 2020లో 5.9 శాతం ప్రతికూల వృద్ధి రేటును నమోదు చేయొచ్చని అంచనా వేసింది. అయితే వచ్చే ఏడాది 3.9 శాతం రికవరీ సాధించే వీలుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అయినప్పటికీ.. ప్రస్తుత క్షీణత శాశ్వత ఆదాయ నష్టానికి కారణం కావచ్చని హెచ్చరించింది.

ఐరాస ట్రేడ్ అండ్ డెవలప్​మెంట్(యూఎన్​సీటీఏడీ) సదస్సులో విడుదల చేసిన ట్రేడ్ అండ్​ డెవలప్​మెంట్ రిపోర్ట్​ 2020లో ఈ విషయాలు పేర్కొంది.

కొవిడ్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలిపింది ఐరాస. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధి -4.3 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేసింది.

2008-2009లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులతో పోలిస్తే ఈ ఏడాది మొదటి రెండు త్రైమాసికాల్లో వెలువడిన గణాంకాలు చాలా అధ్వానంగా ఉన్నట్లు వివరించింది.

ఇతర దేశాల వృద్ధి రేటు ఇలా..

దక్షిణాసియా వృద్ధి రేటు ఈ ఏడాది 4.8 శాతం క్షీణించి.. వచ్చే సంవత్సరం 3.9 శాతం రికవరీ సాధించే వీలుందని యూఎన్​సీటీఏడీ అంచనా వేసింది.

అమెరికా వృద్ధి రేటు 2020లో -5.4 శాతంగా నమోదు కావచ్చని.. 2021లో 2.8 శాతం రికవరీ సాధించే వీలుందని ఐరాస వెల్లడించింది.

చైనా మాత్రం ఈ ఏడాది 1.3 శాతం వృద్ధి రేటు.. 2021లో ఏకంగా 8.1 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని ఐరాస అంచనాల్లో వెల్లడించింది.

ఇదీ చూడండి:'రుణాల పునర్​వ్యవస్థీకరణకు అంత డిమాండ్ లేదు'

ABOUT THE AUTHOR

...view details