తెలంగాణ

telangana

ETV Bharat / business

జోర్దార్​గా అక్షయ తృతీయ పసిడి కొనుగోళ్లు

అక్షయ తృతీయ సందర్భంగా బంగారు అమ్మకాలు జోరందుకున్నాయి. నగల కొనుగోళ్లకు మహిళలు తరలివస్తుండటం వల్ల ఆభరణాల దుకాణాలు కిటకిటలాడుతున్నాయి.

అక్షయ తృతీయ

By

Published : May 7, 2019, 12:50 PM IST

Updated : May 8, 2019, 1:19 PM IST

జోర్దార్​గా అక్షయ తృతీయ పసిడి కొనుగోళ్లు

దేశవ్యాప్తంగా అక్షయ తృతీయ సందడి నెలకొంది. పసిడి కొనుగోళ్లకు మంచి రోజన్న నమ్మకంతో మహిళలు పెద్దసంఖ్యలో దుకాణాలకు తరలివస్తున్నారు.

ఈ సెంటిమెంట్​ను సొమ్ము చేసుకునేందుకు పుత్తడి వ్యాపారులు ఆకర్షణీయ ఆఫర్లతో ముందుకొస్తున్నారు.

అక్షయ తృతీయ పర్వదినాన పుణ్యకార్యాలతో పాటు పసిడి కొనుగోళ్లు జరిపితే లక్ష్మీ కటాక్షం మెండుగా ఉంటుందని నమ్మకం. అందుకే ఈ రోజు అత్యధికంగా పసిడి కొనుగోళ్లకు మొగ్గుచూపుతారు.

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 32,600లుగా ఉంది.

Last Updated : May 8, 2019, 1:19 PM IST

ABOUT THE AUTHOR

...view details