కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత్కు 750 మిలియన్ డాలర్ల (రూ.5,714 కోట్లు) రుణసాయం అందించింది ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ). ఈ రుణానికి ఆమోదం తెలుపుతూ బుధవారం ప్రకటన విడుదల చేసింది.
కరోనాతో తీవ్రంగా నష్టపోయిన వారికి, పేదలకు, అసంఘటిత రంగాలకు సహాయంగా ఈ నిధులను వినియోగించనుంది భారత్.
మధ్య స్థాయి ఆదాయం కలిగిన వారిలో చాలా మందిపై ఇంకా కరోనా ప్రభావం ప్రారంభ దశలోని ఉందని ఏఐఐబీ పేర్కొంది. అయినప్పటికీ అందరూ ప్రభావితమైనట్లు స్పష్టం చేసింది. దీని ప్రభావంతో మిలియన్ల మంది పేదరికంలోకి వెళ్లే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది.
దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థ క్షీణించకుండా చూడటం, ఉత్పాదక సామర్థ్యం, మానవ వనరుల వినియోగం పెంచడం వంటి వాటిపై దృష్టి సారించాల్సిన అవసరముందని ఏఐఐబీ పేర్కొంది. ఇందుకోసం భారత్కు తమ మద్దతు ఉంటుందని తెలిపింది.
ఇదీ చదవండి:డేటా వినియోగంలో భారతీయులే టాప్