వార్షిక బడ్జెట్ సమీపిస్తున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దేశంలోని ఉన్నత ఆర్థికవేత్తలతో నేడు సమావేశం కానున్నట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. బడ్జెట్‌కు ముందు చేసే కసరత్తులో భాగంగానే ఈ భేటీ ఉండనున్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది. గత ఏడాది జూన్‌లో 40 మంది ఆర్థిక వేత్తలతో మోదీ భేటీ అయినట్లు గుర్తుచేసింది.
బడ్జెట్ నేపథ్యంలో ఆర్థికవేత్తలతో నేడు మోదీ భేటీ
దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ఆర్థికవేత్తలతో ప్రధాని నరేంద్ర మోదీ నేడు నీతి ఆయోగ్‌లో భేటీకానున్నారు. ప్రస్తుతం నెలకొన్న వృద్ధి మందగమన పరిస్థితులు, బడ్జెట్ నేపథ్యంలో ఆర్థిక నిపుణుల నుంచి మోదీ కీలక సూచనలు తీసుకునే అవకాశముంది.
ఆర్థికవేత్తలతో ప్రధాని భేటీ
ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక వృద్ధి మందగమన పరిస్థితుల నేపథ్యంలో ఆర్థికవేత్తలతో ప్రధాని భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే అవకాశముంది. దీనిపై ప్రభుత్వ వర్గాలు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
Last Updated : Jan 9, 2020, 11:42 AM IST