కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఉల్లి ఘాటు, బంగాలదుంపల ధరల మోత కొనసాగుతోంది. ఈ జాబితాలోకి తాజా వంట నూనెలు కూడా చేరి సామాన్యుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. నూనె గింజల ధరలు పెరగటం వల్ల.. వంట నూనేలు ప్రియమవుతున్నట్లు తెలుస్తోంది. గడిచిన ఆరు నెలల్లో దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో క్రూడ్ పామాయిల్ (సీపీఓ) ధర 53 శాతం పెరిగింది. మలేసియాలో సోయాబిన్ ఉత్పత్తి భారీగా తగ్గటమే ఇందుకు ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అవాల ధరలు కూడా క్రమంగా పెరుగుతూ వస్తున్నట్లు చెబుతున్నాయి.
మార్కెట్ వర్గాల ప్రకారం..
ఇటీవల ముడి ఆవాల ధర (హోల్ సేల్) 10 కిలోలకు రూ.1,155 పలకగా.. సోయా నూనే హోల్ సేల్ ధర 10 కిలోలకు రూ.995-1010 వద్దకు చేరింది. పామాయిల్ ధర 10 కిలోలు రూ.935-945గా ఉంది.
ఇదే సమయంలో కుసుమ నూనే హోల్ సేల్ ధర 10కిలోలకు రూ.1,180-1,220 మధ్య పలుకుతోంది.