భారత వృద్ధి రేటు అంచనాలను దిగువకు సవరించింది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ). 2021-22లో దేశ వృద్ధి రేటు 10 శాతంగా నమోదయ్యే అవకాశముందని తాజా గణాంకాల్లో వెల్లడించింది. ఇంతకు ముందు ఈ అంచనా 11 శాతంగా ఉండటం గమనార్హం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.5 శాతం వృద్ధి రేటుతో సరిపెట్టుకోవచ్చని తెలిపింది.
ఈ ఏడాది మార్చిలో ప్రారంభమైన కొవిడ్ రెండో దశ.. భారత వృద్ధి రేటు రికవరీ వేగాన్ని అడ్డుకున్నట్లు వివరించింది ఏడీబీ. దీని ప్రభావం అధికంగా ఉంటుందని భావించినప్పటికీ.. పలు రాష్ట్రాలు లాక్డౌన్ ఎత్తేయడం, ఆంక్షలను సడలించడం వల్ల దాదాపు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది.