ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు అంచనాలను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) దిగువకు సవరించింది. 2021-22లో భారత వృద్ధి రేటు 10 శాతానికి పరిమితమవ్వచ్చని ఏషియన్ డెవలప్మెంట్ ఔట్లుక్ (ఏడీఓ) పేరుతో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్లో విడుదల చేసిన ఏడీఓ నివేదికలో ఈ అంచనా 11 శాతంగా ఉంది. కరోనా రెండో దశ వల్ల ఏర్పడిన సంక్షోభమే అంచనాలను దిగువకు సవరించేందుకు కారణంగా నివేదిక వెల్లడించింది.
చైనా విషయానికొస్తే.. 2021లో 8.1 శాతం, 2022లో 5.5 శాతం వృద్ధి రేటు సాధిస్తుందన్న అంచనాలను యథాతథంగా ఉంచింది ఏడీఓ. ఏప్రిల్ అంచనాలకు అనుగునంగానే ఆ దేశంలో పరిస్థితులు ఉన్నట్లు వివరించింది.