తెలంగాణ

telangana

లాక్​డౌన్​లో భారీగా పెరిగిన పీఎఫ్ ఉపసంహరణలు

By

Published : Apr 28, 2020, 9:44 PM IST

దేశవ్యాప్తంగా విధించిన లాక్​డౌన్​తో పీఎఫ్ ఉపసంహరిస్తున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 8.2 లక్షలమంది ఉద్యోగులు తమ పీఎఫ్​ పొదుపు మొత్తాలను విత్​డ్రా చేసుకున్నట్లు పేర్కొంది సంస్థ. ఈ మొత్తం రూ. 3,243కోట్లుగా ఉంటుందని వెల్లడించింది.

epfo
లాక్​డౌన్​లో ఉద్యోగులకు ఆర్థిక కష్టాలు.. పెరిగిన పీఎఫ్ ఉపసంహరణ

లాక్‌డౌన్‌లో పీఎఫ్‌ ఉపసంహరిస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇప్పటి వరకు 8.2 లక్షల మంది రూ.3,243.17 కోట్లను తీసుకున్నారు. కొవిడ్‌-19ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను అమలు చేస్తుంది. నిత్యావసరాలు మినహా వ్యాపారాలన్నీ మూసేసిన కారణంగా చాలామంది వద్ద నగదు కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో పీఎఫ్‌ డబ్బులు తీసుకొనేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఈ నిబంధనల్లో తీసుకున్న మొత్తాన్ని తిరిగి జమ చేసేందుకు ఉన్న అవకాశాన్ని తొలగించింది. అయినప్పటికీ ఉద్యోగులు నగదు ఉపసంహరణ వైపు మొగ్గు చూపుతున్నారు.

"కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ పరిధిలోని ఈపీఎఫ్​ఓ ఇప్పటివరకు 12.91 లక్షల దరఖాస్తులకు ప్రతిస్పందించింది. ఇందులో 7.40 లక్షల వినతులు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద చేపట్టింది."

-ఈపీఎఫ్ఓ ప్రకటన

మొత్తం రూ.4,684.52 కోట్లను పంపిణీ చేయగా అందులో పీఎంజీకేవై క్లెయింలు రూ.2,367.65 కోట్లు ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈపీఎఫ్​ఓ మినహాయించిన ప్రైవేటు పీఎఫ్‌ ట్రస్టుల నుంచీ క్లెయిమ్స్‌ ఎక్కువగానే ఉన్నాయని వెల్లడించింది. వీటిలో 2020, ఏప్రిల్‌ 27 నాటికి 79,743 క్లెయిమ్స్‌ చేసుకోగా రూ.875.52 కోట్లు పంపిణీ చేశారని పేర్కొంది.

ప్రైవేటు రంగంలోని 222 సంస్థలు 54,641 లబ్ధిదారులకు రూ.338.23 కోట్లు, 76 ప్రభుత్వ రంగ సంస్థలు 24,178 లబ్ధిదారులకు రూ.524.75 కోట్లు, 23 సహకార రంగ సంస్థలు 924 లబ్ధిదారులకు రూ.12.54 కోట్లు పంపిణీ చేయడం గమనార్హం.

ఇదీ చూడండి:భారత్​కు ఏడీబీ రూ.11,400 కోట్ల సాయం

ABOUT THE AUTHOR

...view details