తెలంగాణ

telangana

ETV Bharat / business

కేంద్ర జీఎస్​టీ 'ఆఫర్'​కు ఆ రాష్ట్రాలు వ్యతిరేకం - GST Compensation to states

జీఎస్​టీ పరిహారాన్ని రుణాల ద్వారా పొందాలన్న కేంద్ర ప్రభుత్వ ఆఫర్​ను 7 రాష్ట్రాలు వ్యతిరేకించాయి. తమకు న్యాయం చేసే బాధ్యత కేంద్రానిదేనని తేల్చి చెప్పాయి.

7 states, 1 UT oppose Centre's proposal of borrowing to meet GST compensation shortfall
కేంద్ర జీఎస్​టీ 'ఆఫర్'​కు ఆ 7 రాష్ట్రాలు వ్యతిరేకం

By

Published : Sep 1, 2020, 4:18 PM IST

జీఎస్​టీ పరిహారం చెల్లింపు విషయంలో రాష్ట్రాలు- కేంద్రం మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. తాజాగా.. పరిహారం కోసం రుణాలు తీసుకోవాలన్న కేంద్రం ఇచ్ఛికను.. కేరళ, పంజాబ్​ సహా 7 భాజపాయేతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. కేంద్రమే న్యాయబద్ధంగా తమకు పరిహారాన్ని చెల్లించాలని స్పష్టం చేశాయి.

ఈ అంశంపై చర్చించేందుకు పంజాబ్​, బంగాల్​, కేరళ, దిల్లీ, ఛత్తీస్​గఢ్​, తెలంగాణా రాష్ట్రాలు.. సోమవారం అనధికారికంగా సమావేశమయ్యాయి. జీఎస్​టీ పరిహారంలో ప్రత్యామ్నాయాలను పరిశీలించే అవసరం ఉందని ఈ రాష్ట్రాలు అభిప్రాయపడ్డాయి.

అదే సమయంలో కాంగ్రెస్​ పాలిత రాజస్థాన్​, పుదుచ్చేరి కూడా కేంద్రమిచ్చిన ఆఫర్​ను వ్యతిరేకించాయి.

ఇదీ చూడండి:-జీఎస్​టీ పరిహారంపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ

ఈ విషయంపై పంజాబ్​ ఆర్థికమంత్రి మన్​ప్రీత్​ సింగ్​ బాదల్​.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​కు లేఖ రాశారు. గత జీఎస్​టీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పునఃపరిశీలించుకోవాలని కోరారు. మరింత స్పష్టత కోసం అత్యవసర సమావేశం నిర్వహించాలని డిమాండ్​ చేశారు.

రాష్ట్రాల డిమాండ్​...

కరోనాతో నెలకొన్న పరిస్థితులతో తీవ్రమైన ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న రాష్ట్రాలు.. జీఎస్టీ పరిహారం చెల్లించాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చాయి. ఈ నేపథ్యంలో గురువారం దిల్లీలో 41వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ విషయంలో రాష్ట్రాలకు కేంద్రం రెండు ఇచ్ఛికలను ప్రతిపాదించింది.

ఇవీ చూడండి:-

జీఎస్టీ పరిహారంపై బిహార్​ రూటే సెపరేటు

ABOUT THE AUTHOR

...view details