తెలంగాణ

telangana

ETV Bharat / business

మీ పిల్లలకు ఇచ్చే బహుమతులు ఇలా ఉంటే మేలు

సాధారణంగా పండుగల సమయాల్లో తల్లిదండ్రులు వారి పిల్లలకు , బొమ్మలు, గాడ్జెట్​లు, బట్టలు సహా ఎన్నో ఖరీదైన బహుమతులు ఇస్తుంటారు. ఎప్పుడూ ఇవే పునరావృతమవుతుంటే బోర్​ కొట్టట్లేదా. అలా కాకుండా.. మీ పిల్లలు ఆర్థిక క్రమశిక్షణవైపు మొగ్గు చూపే బహుమతులు ఇవ్వండి. మరి మీ పిల్లల్ని ఉత్తమ ఆర్థిక క్రమశిక్షణతో ఎదిగేలా చేయాలంటే పాటించాల్సిన ఐదు నియమాలు మీ కోసం.

GIFT
క్రిస్మస్​ గిఫ్ట్​ ఇలా ఉంటే మేలు

By

Published : Dec 25, 2019, 7:01 AM IST

''పొదుపు అనేది చాలా మంచి విషయం. మరీ ముఖ్యంగా మీ తల్లిదండ్రులు మీ కోసం పొదుపుచేస్తే..''

- విన్​స్టన్​ చర్చిల్​

నిజమే పై మాటల్లో ఎలాంటి సందేహం లేదు. మరి మీరు మీ పిల్లల కోసం పెట్టుబడి పెట్టడం.. వారిని ఆర్థిక క్రమశిక్షణతో మెలిగేలా చేసేందుకు ఉన్న మార్గాల వంటి వివరాలు తెలుసుకోండి.

పిగ్గీ బ్యాంక్​..

పిగ్గీ బ్యాంక్

తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇవ్వాల్సిన బహుమతుల్లో పిగ్గీ బ్యాంక్​ ఉత్తమమైందని చెప్పొచ్చు. ఇంతకు ముందులాగా ఇది అంత ప్రాచుర్యం పొందకపోయినప్పటికీ పిగ్గీ బ్యాంక్​ (సేవింగ్స్​ జార్​)లో డబ్బు దాయడం ఓ సరదాతో కూడుకున్న పొదుపు ప్రణాళికగా చెప్పొచ్చు.

పిగ్గీ బ్యాంక్​ మీ పిల్లకు ఇచ్చేముందు అందులో కొంత డబ్బును ఉంచండి. మీ పిల్లలను అందులో డబ్బు దాస్తూ ఉండమని చెప్పండి. ఈ అలవాటు కచ్చితంగా మీ పిల్లలకు డబ్బువిలువ తెలిసేలా చేస్తుంది. మరీ ముఖ్యంగా పొదుపు చేసేందుకు ఇది తొలి మెట్టు అవుతుంది.

చదువు​, పెళ్లి కోసం సిప్..​

సిప్​

ఇప్పటికే మీ పిల్లల కోసం వారి పేరుపై బ్యాంక్ ఖాతా తెరిచి ఉంటే.. దాని ద్వారా లావాదేవీలు జరుపుతూ ఉండండి. ఖాతాలో సిప్​ (సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్​మెంట్ ప్లాన్​) ప్రారంభించండి. మీ పిల్లల వయస్సుకు అనుగుణంగా ఉన్నత చదువులు, పెళ్లిళ్ల కోసం నెల, మూడు నెలలు, వార్షిక ప్రణాళికతో బ్యాంకులో పొదుపు చేయండి. బ్యాంకు ఖాతా వినియోగం గురించి మీ పిల్లలకు నేర్పించండి.

మ్యూచువల్​ ఫండ్లు..

మ్యూచువల్​ ఫండ్లలో పెట్టుబడి

ఒక వేళ మీరు మీ పిల్లల కోసం దీర్ఘకాలిక పొదుపు బహుమతి ఇవ్వాలనుకుంటే.. మ్యూచువల్​ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి. ఏఏఏ రేటింగ్ ఉన్న సెక్యూరిటీ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మంచిది. ముఖ్యంగా ఈ ఫండ్, మెచ్యూరిటీ వంటి వివరాలను మీ పిల్లలకు వివరించండి.

బహుమతిగా స్టాక్​లు..

స్టాక్​ మార్కెట్లో పెట్టుబడి

మీ పిల్లలకు ఏదైన ప్రముఖ కంపెనీ స్టాక్​ బహుమతిగా ఇవ్వండి. స్టాక్ ఎలా పని చేస్తుంది.. వాటి ఉపయోగాలు ఏంటనే విషయాలు వాళ్లకి అర్థమయ్యేలా చెప్పండి. వారికి తెలిసిన కంపెనీ స్టాక్​లు అయితే మరీ మంచిది. ముఖ్యంగా బొమ్మల కంపెనీ, స్మార్ట్​ఫోన్​ కంపెనీల వంటివి. మీ పిల్లలు మైనర్లు అయితే వారు స్టాక్​లు కొనలేరు.. కానీ వారి పేరుపై సంరక్షకుడిగా మీరు ఖాతాను తెరిచి మీ అధీనంలో కొనుగోళ్లు జరిపే వీలుంది.

గోల్డ్​ ఈటీఎఫ్​..

బంగారంపై పెట్టుబడి

బంగారు బహుమతులు నచ్చని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. మీ పిల్లల కోసం మీరు బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటే.. నగల రూపంలో కాకుండా ఈటీఎఫ్​ల రూపంలో పెట్టుబడి పెట్టండి. దీని ద్వారా మీ పిల్లలకు భవిష్యత్​లో ఉత్తమ రిటర్నులు వస్తాయనడంలో ఎలాంటి సందేహంలేదు.

ఇదీ చూడండి:ఈ దశాబ్దిలో... ఈ-విపణిలో ఇరుక్కుపోతాం!

ABOUT THE AUTHOR

...view details