తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రధాని చేతికి 15వ ఆర్థిక సంఘం నివేదిక

15వ ఆర్థిక సంఘం.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన నివేదికను సమర్పించింది. 2021-22 నుంచి 2025-26 వరకూ కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్ను పంపిణీపై ఈ నివేదిక ఉంది. ఇటీవలే ఈ నివేదికను రాష్ట్రపతికి కూడా సమర్పించింది ఆర్థిక సంఘం.

15th-fincomm-submits-report-to-prime-minister
ప్రధాని చేతికి 15వ ఆర్థిక సంఘం నివేదిక

By

Published : Nov 17, 2020, 6:21 AM IST

రాబోయే ఐదేళ్లల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్ను పంపిణీ నిష్పత్తిపై.. 15వ ఆర్థిక సంఘం ప్రధాని నరేంద్ర మోదీకి నివేదిక సమర్పించింది. 2021-22 నుంచి 2025-26 వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్ను పంపిణీపై 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ ఎన్. కె. సింగ్, కమిషన్‌ సభ్యులు.. మోదీకి నివేదిక సమర్పించారని అధికారిక ప్రకటన విడుదలైంది.

నవంబర్‌ 9న ఆర్థిక సంఘం ప్రతినిధులు రాష్ట్రపతికి నివేదిక సమర్పించారు. రాజ్యాంగం నిర్దేశించిన విధంగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ద్వారా వివరణాత్మక నివేదికను అందించామని ఆర్థిక సంఘం వెల్లడించింది. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు మొత్తం పన్నుల్లో 42శాతం ఇవ్వమని సిఫారసు చేయగా.. 15వ ఆర్థిక సంఘం 2020-21 సంవత్సరానికి రాష్ట్రాలకు 8 లక్షల 55 వేల 176 కోట్లు కేటాయించాలని సిఫారసు చేసింది. ఫైనాన్స్‌ కమిషన్‌ ఇన్‌ కోవిడ్‌ టైమ్స్‌ పేరిట రూపొందించిన ఈ నివేదికను మంగళవారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు కూడా అందించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details