తెలంగాణ

telangana

ETV Bharat / business

వచ్చే ఏడాది ప్రథమార్ధంలో జొమాటో ఐపీఓ

ప్రముఖ ఆన్​లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో.. ఐపీఓకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఐపీఓ ప్రక్రియ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు సంస్థ సీఈఓ దీపిందర్​ గోయల్ తెలిపారు.

zomato ready for ipo
వచ్చే ఏడాది ఐపీఓకు జొమాటో

By

Published : Sep 11, 2020, 5:42 AM IST

ఆన్​లైన్ ఫుడ్ డెలివరీ, రెస్టారెంట్ గైడ్ సంస్థ జొమాటో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చేందుకు ప్రణాళికలు వేస్తోంది. వచ్చే ఏడాది (2021) ప్రథమార్ధంలో ఇది జరగొచ్చని తెలుస్తోంది. ఈ విషయాన్ని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్​లో పేర్కొన్నారు. ఐపీఓ కోసం సంస్థ లీగల్ బృందాలు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇటీవలి కాలంలో సంస్థ విలువ భారీగా పెరుగుతున్నట్లు దీపిందర్​ వెల్లడించారు. ఇందుకు కృష్టి చేసిన ఉద్యోగులందరికి అభినందనలు తెలిపారు. ఓ అంచనా ప్రకారం జొమాటో మార్కెట్ విలువ 3.2 బిలియన్ డాలర్ల నుంచి 3.3 బిలియన్ డాలర్లు.

ప్రస్తుత ఉద్యోగులకు మరింత విలువ చేకూర్చే విధంగా వచ్చే ఏడాది ఈసాప్స్‌ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఐపీఓతో సంస్థ విలువ మరింత పెరుగుతుందని అని గోయల్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:అమెజాన్​తో రిలయన్స్​ 2వేల కోట్ల డాలర్ల డీల్​!

ABOUT THE AUTHOR

...view details