జొమాటో పబ్లిక్ ఇష్యూకు సెబీ ఆమోదముద్ర వేసింది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా రూ.8,250 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో భాగంగా రూ.7,500 కోట్ల విలువైన కొత్త షేర్లను జొమాటో జారీ చేయనుంది.
ఆఫర్ ఫర్ సేల్‌లో (ఓఎఫ్‌ఎస్) ఇన్ఫోఎడ్జ్ రూ.350 కోట్ల విలువైన షేర్లను విక్రయించనుంది. తొలుత రూ.750 కోట్లను ఓఎఫ్‌ఎస్‌లో విక్రయించాలని ఇన్ఫోఎడ్జ్ భావించినప్పటికీ.. ఆ తర్వాత దానిని రూ.350 కోట్లకు పరిమితం చేసుకుంది. ఐపీఓ నిమిత్తం ఏప్రిల్‌లో జొమాటో దరఖాస్తు చేసుకోగా.. జులై 2న అనుమతులు ఇచ్చామని సెబీ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా తెలుస్తోంది.