తెలంగాణ

telangana

ETV Bharat / business

జొమాటో బంపర్ ఆఫర్- బగ్ గుర్తిస్తే రూ.3లక్షల రివార్డ్ - జొమాటో లేటెస్ట్ ఆఫర్లు

ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ కంపెనీ.. జొమాటో తమ వెబ్​సైట్​, యాప్​ను భద్రతా పరంగా మరింత పటిష్టం చేసుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. తమ వెబ్​సైట్​, యాప్​లో ఏదైనా బగ్​ గుర్తించిన ఎథికల్ హ్యాకర్లకు రూ.3 లక్షల వరకు రివార్డ్ ఇవ్వనున్నట్లు తెలిపింది.

Zomato reward to Ethical hackers
జొమాటో భారీ రివార్డ్​

By

Published : Jul 13, 2021, 2:59 PM IST

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్ జొమాటో ఎథికల్ హ్యాకర్స్‌కి అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. తమ వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో బగ్‌ను కనిపెడితే 100 డాలర్ల (సుమారు రూ.7,500) నుంచి 4,000 డాలర్లు (దాదాపు రూ.3 లక్షల) వరకు ప్రైజ్ మనీ అందివ్వనున్నట్లు తెలిపింది. అయితే బగ్‌ తీవ్రత ఆధారంగా ప్రైజ్‌ మనీ నిర్ణయిస్తామని వెల్లడించింది. అలానే హ్యాకర్స్ కనిపెట్టిన బగ్ ఎంత తీవ్రమైందనేది జొమాటో సైబర్ సెక్యూరిటీ నిర్ణయిస్తుందని తెలిపింది. ఒకవేళ బగ్ వల్ల కంపెనీకి పెద్ద ప్రమాదం లేదనుకుంటే తక్కువ నగదు చెల్లిస్తారు.

బగ్ బౌంటీలో భాగంగా హ్యాకర్స్ ఎవరైనా పొరపాటున నిబంధనలు అతిక్రమించినా తాము ఎలాంటి చట్టపరమైన చర్యలు చేపట్టమని జొమాటో తెలిపింది. 'మా వెబ్‌ లేదా యాప్‌లను భద్రతా పరంగా మరింత మెరుగుపరచాలనే ఆలోచనతో జొమాటో బగ్ బౌంటీ ప్రోగ్రామ్ ప్రారంభించాం. అలానే ఈ ప్రోగ్రాం హ్యాకర్స్‌కి చక్కటి ప్రోత్సాహాన్ని అందిస్తుందని భావిస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో మీరు భాగస్వామ్యం అవుతున్నందుకు కృతజ్ఞతలు. మీరు అందించే బగ్‌ రిపోర్టుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటాం' అని జొమాటో ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇదీ చదవండి:రాయల్​ ఎన్​ఫీల్డ్ బైక్​ కొనాలనుకునే వారికి షాక్!

ABOUT THE AUTHOR

...view details