తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వయం కృషీవలురు ఈ యువ శ్రీమంతులు - యువ శ్రీమంతులు

తాత, తండ్రి సంపాదించిన ఆస్తిని మరింత పెంచే వారసులను చూశాం. అయితే కొంత మంది మాత్రం స్వయం కృషితో ఎదికి ఎంతో మందికి నిలుస్తారు. అలా ఎదిగి దేశంలో అత్యంత సంపన్నులుగా మారిన యువ పారిశ్రామిక వేత్తల సంపాదన, వారి వ్యాపార విశేషాలు మీ కోసం.

YOUNG
స్వయం కృషీవలురు ఈయువ శ్రీమంతులు

By

Published : Dec 18, 2019, 8:19 AM IST

మనోళ్లే గ్రేట్‌

ప్రపంచవ్యాప్త యువ శ్రీమంతుల జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో ఎక్కువ మంది.. వారసత్వంగా వచ్చిన ఆస్తిపాస్తులతో పైకి ఎదిగినవారే. అయితే ఇందుకు భిన్నంగా భారత్‌ జాబితాలోని వాళ్లు మాత్రం ఎక్కువ మంది స్వయం కృషితో ఈ స్థాయికి వచ్చారు.

సాంకేతికతే.. సొమ్ము

సాంకేతికత రంగంలో వేగవంతంగా చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులను యువత సమర్థంగా ఉపయోగించుకుంటోంది. ఎందుకుంటే జాబితాలో స్వయంకృషితో శ్రీమంతులుగా ఎదిగిన వారందరూ సాంకేతికత ఆధారిత సంస్థలను నెలకొల్పే కుబేరులుగా అవతరించారు.

బెంగళూరోళ్లు భళా..

దేశంలోని యువ శ్రీమంతులకు బెంగళూరు రాజధానిగా మారిందని చెప్పొచ్చు. జాబితాలోని ఎక్కువ మంది ఈ నగరానికి చెందిన వారే. అన్ని వయస్సులను లెక్కలోకి తీసుకుంటే ముంబయిలో ఎక్కువ మంది కుబేరులు ఉండగా.. 40 ఏళ్లలోపు శ్రీమంతుల విషయంలో బెంగళూరుదే అగ్రస్థానం.

పిన్న వయస్కుడు 'ఓయో' రితేశ్‌

రితేశ్​

యువ శ్రీమంతుల జాబితాలో పిన్న వయస్కుడు ఓయో రూమ్స్‌ వ్యవస్థాపకుడు రితేశ్‌ అగర్వాల్‌ (25 ఏళ్లు). ఈయన నికర సంపద రూ.7,500 కోట్లు. ఆ తర్వాతి స్థానాల్లో నిఖిల్‌ కామత్‌ (జెరోధా), భావిష్‌ అగర్వాల్‌ (ఓలా) ఉన్నారు.

దివ్వాంక్​
నితిన్​

2010లో మీడియా డాట్‌నెట్‌ను దివ్యాంక్‌ తురాకియా స్థాపించారు. ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఆన్‌లైన్‌ వ్యాపార ప్రకటనల సంస్థల్లో మీడియా డాట్‌నెట్‌ ఒకటి. 2016లో మీడియా డాట్‌ నెట్‌ను దివ్యాంక్‌ విక్రయించారు. ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌ వ్యాపార ప్రకటనల విభాగంలో చోటుచేసుకున్న మూడో అతిపెద్ద విక్రయ లావాదేవీగా ఇది నిలిచింది.

జాబితాలో ఇద్దరు సోదరులకు చోటు దక్కింది. వారే జెరోధా వ్యవస్థాపకులు నితిన్‌ కామత్‌, నిఖిల్‌ కామత్‌. ఇటీవలే వీళ్లు మరో సంస్థ ‘ట్రూ బికాన్‌’ను స్థాపించారు.

సచిన్​ బన్సాల్​, బిన్నీ బన్సాల్​
యువ శ్రీమంతుల జాబితా

ఇదీ చూడండి:'పేసా'తో భారత ఆర్థిక సేవల రంగంలోకి రియల్​మీ

ABOUT THE AUTHOR

...view details