తెలంగాణ

telangana

ETV Bharat / business

మారటోరియం ప్రభావంతో ఎస్​ బ్యాంక్​ షేర్లు పతనం

స్టాక్​ మార్కెట్లలో ఎస్​ బ్యాంక్ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ మారటోరియం విధించటం, బ్యాంకు బోర్డును రద్దు చేయటం వల్ల మదుపరులపై ప్రతికూల ప్రభావం ఏర్పడింది.

yes bank
ఎస్ బ్యాంక్

By

Published : Mar 6, 2020, 11:13 AM IST

భారత రిజర్వ్ బ్యాంక్ మారటోరియం నేపథ్యంలో ఎస్​ బ్యాంక్​ షేర్లు భారీగా పడిపోయి 12 నెలల కనిష్ఠానికి చేరుకుంది. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి- సెన్సెక్స్​లో ఎస్​ బ్యాంక్ షేరు విలువ 25.96 శాతం పతనమై రూ.27.65కు చేరుకుంది.

జాతీయ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీలోనూ 20 శాతం పడిపోయి రూ. 29.45కు చేరుకుంది.

బోర్డు రద్దు..

ఎస్‌ బ్యాంక్‌ బోర్డును రద్దు చేసిన ఆర్బీఐ.. 30 రోజుల పాటు తమ అదుపులో ఉంచుకోనున్నట్లు నిన్న ప్రకటించడం మార్కెట్లలో భయాన్ని నింపింది. ఇప్పటికే ఈ బ్యాంక్‌పై మారటోరియం విధించి విత్‌డ్రా పరిమితి రూ.50వేలుగా నిర్ణయించారు.

ఎస్‌ బ్యాంక్‌ కొనుగోలుకు భారతీయ స్టేట్​ బ్యాంక్​ సిద్ధమవుతోందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎస్బీఐ​ షేరు కూడా 6 శాతం పతనమైంది.

ఎస్​ బ్యాంక్​, ఎస్బీఐతో పాటు బ్యాంకింగ్ రంగంలోని అన్ని సంస్థలు భారీ నష్టాల్లోనే ఉన్నాయి.

విత్​డ్రాకు ఎస్​ బ్యాంక్​ ఖాతాదారుల క్యూ..

ఎస్​ బ్యాంక్​లో విత్​డ్రా పరిమితి నెలకు రూ.50 వేలుగా ఆర్బీఐ నిర్ణయించటం వల్ల ఖాతాదారులు నగదు ఉపసంహరణకు సిద్ధమయ్యారు. మెట్రో నగరాల్లో ముఖ్యంగా ముంబయిలో ఎస్​ బ్యాంక్ ఏటీఎంల వద్ద భారీగా వినియోగదారులు బారులు తీరారు.

ABOUT THE AUTHOR

...view details