ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎస్ బ్యాంకు లాభాలు ఏకంగా 92.4 శాతం తగ్గి.. రూ. 95.56 కోట్లుగా నమోదయ్యాయి. 2018-19 క్యూ1లో రూ.1,265.67 కోట్ల నికర లాభాన్ని గడించింది ఎస్ బ్యాంకు.
మొండి బకాయిలు పెరగడమే లాభాలు భారీగా క్షీణించడానికి కారణమని బ్యాంకు తెలిపింది. గత ఏడాది జూన్లో రూ. 2,824.46 కోట్లుగా ఉన్న మొండి బకాయిలు.. ఈ ఏడాది జూన్ నాటికి రూ.12,091.10 కోట్లకు పెరిగినట్లు పేర్కొంది.