ఎస్ బ్యాంక్ మనీలాండరింగ్ కేసుతో సంబంధం ఉన్న కాక్స్ అండ్ కింగ్స్ సంస్థ కార్యాలయాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. ముంబయిలోని ఈ ట్రావెల్ సంస్థకు చెందిన 5 ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో మరిన్ని సాక్ష్యాల కోసమే దాడులు చేసినట్లు స్పష్టం చేశారు.
ఎస్ బ్యాంకు నుంచి అధికంగా రుణాలు పొందిన సంస్థల్లో కాక్స్ అండ్ కింగ్స్ ఒకటి. ఈ సంస్థకు సుమారు రూ.2,260 కోట్లు ఎస్ బ్యాంకు రుణంగా అందించినట్లు తేలింది.
అనేక కార్పొరేటు సంస్థలపై..