అర్హత కలిగిన సంస్థలు, హక్కులు, షేర్ల కొనుగోలుతో రూ.5,000 కోట్ల నిధుల సమీకరణకు ఎస్ బ్యాంకు బోర్డు ఆమోదం తెలిపింది. తాజాగా జరిగిన బ్యాంకు బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమావేశంలో బ్యాంకు ఎండీ, సీఈఓగా ప్రశాంత్ కుమార్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
అర్హత కలిగిన సంస్థలే కాకుండా భద్రతపరమైన హామీ మార్గాలు, హక్కులు, అంతర్జాతీయ డిపాజిటరీ రశీదులు, అమెరికన్ డిపాజిటరీ రశీదులు, విదేశీ కరెన్సీ మారకం బాండ్లు లేదా ఏదైనా ఆమోదించదగిన మార్గంలో ఈ నిధులను సేకరించనున్నట్లు బోర్డు తెలిపింది.
ఇప్పటికే రూ.10వేల కోట్లకు అంగీకారం..
అయితే నిధుల సేకరణ రూ.15 వేల కోట్లకు మించకూడదు. ఇప్పటికే 2020 ఫిబ్రవరి 7న రూ.10 వేల కోట్ల నిధుల సేకరణకు బోర్డు ఆమోదం తెలపగా.. ప్రస్తుతం మరో రూ.5 వేల కోట్లకు అంగీకారం లభించింది.