తెలంగాణ

telangana

ETV Bharat / business

భారత విపణిలోకి షియోమీ రెడ్​మీ-8 బడ్జెట్​ ఫోన్లు - భారత విపణిలోకి షియోమీ రెడ్​మీ-8 బడ్జెట్​ ఫోన్లు

చైనా దిగ్గజ సంస్థ షియోమీ... రెడ్​మీ సిరీస్​లో బడ్జెట్​ ఫోన్లను భారత విపణిలోకి విడుదల చేసింది.

భారత విపణిలోకి షియోమీ రెడ్​మీ-8 బడ్జెట్​ ఫోన్లు

By

Published : Oct 9, 2019, 7:02 PM IST

చైనాకు చెందిన మొబైల్​ దిగ్గజ సంస్థ షియోమీ రెడ్​మీ సిరీస్​లో మరో మోడల్​ 'రెడ్​మీ-8'ను భారత విపణిలోకి విడుదల చేసింది. సరికొత్త హంగులతో తయారైన ఈ మోడల్​ రెండు వేరియంట్లలో ఆన్​లైన్​లో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది.

మొదటి 50 లక్షల మంది వినియోగదారులకు 4జీబీ ర్యామ్​/64 జీబీ ఫోన్​ కేవలం రూ.7,999కే అందిస్తున్నట్లు ప్రకటించింది షియోమీ.

రెడ్​మీ-8 ప్రత్యేకతలు

  1. 3జీబీ ర్యామ్​/32 జీబీ మెమొరీ కలిగిన ఈ ఫోన్ ​ధర రూ.7,999...4జీబీ ర్యామ్​/64 జీబీ ఫోన్ ​ధర రూ. 8,999. ఈ బడ్జెట్​ ఫోన్లతో ఇతర సంస్థల ఫోన్లతో మరింత పోటీ పెరగనుంది.
  2. 12ఎంపీ సోనీ ఐఎంఎక్స్​​363 డ్యూయల్​ కెమెరా, 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ, యూఎస్​బీ టైప్​-సీ పోర్ట్​, 18 వాట్స్​ సపోర్ట్​తో వేగవంతమైన ఛార్జింగ్​ దీని ప్రత్యేకత.
  3. కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 5, పీ2ఐ స్ప్లాష్​​ ప్రూఫ్​ కోటింగ్, 6.2 అంగుళాల ఐపీఎస్​ ఎల్​సీడీ డిస్​ప్లే, ఫింగర్​ ఫ్రింట్​ సెన్సార్​​ ఈ స్మార్ట్‌ఫోన్​కున్న మరిన్ని ప్రత్యేకతలు.
  4. వైర్​లెస్​ ఎఫ్​ఎం రేడియో, డ్యూయల్​ సిమ్​ విత్​ వోల్ట్​ సామర్థం. 256 జీబీ వరకు పెంచుకోగలిగే (2+1) మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్​. ​

ABOUT THE AUTHOR

...view details